'ఆచార్య' అసలేం జరుగుతోంది  

మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమాకు అన్ని అడ్డంకులే అన్నట్లుగా అనిపిస్తుంది.గత ఏడాదిలోనే ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా సైరా కారణంగా నెలలకు నెలలు వాయిదాల మీద వాయిదాలు పడింది.

TeluguStop.com - Chiranjeevi Kajal Agarwal Acharya Movie Shooting Update

ఎట్టకేలకు సినిమాను ప్రారంభించి మొదటి షెడ్యూల్‌ పూర్తి అయ్యిందో లేదో కరోనా అంటూ ఎనిమిది నెలలు సమయం వృదా అయ్యింది.ఇటీవల ప్రారంభించేందుకు సిద్దం అయిన సమయంలో చిరంజీవికి కరోనా అంటూ రిపోర్ట్ వచ్చి అంతా షాక్‌ అయ్యేలా చేసింది.

అలా మొత్తానికి చిరంజీవి సినిమా ఆచార్య మొదటి నుండి కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు గందరగోళంగా మారింది.దర్శకుడు కొరటాల శివ ఆ గందరగోళ పరిస్థితులను మళ్లీ క్లీయర్‌ చేశాడు.

TeluguStop.com - ఆచార్య’ అసలేం జరుగుతోంది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఎట్టకేలకు మళ్లీ ఈ సినిమా షూటింగ్‌ పునః ప్రారంభం అయ్యింది.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.తాజాగా చిరంజీవి షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యాడు.ప్రస్తుతం చిరంజీవి మరియు సోనూసూద్‌లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు.

వచ్చే ఏడాది లో సినిమాను విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.రామ్‌ చరణ్‌ కూడా కీలక పాత్రలో ఇందులో కనిపించబోతున్నాడు.

ఆయన ఎప్పుడు చిత్రీకరణలో పాల్గొంటాడు అనే విషయంలో క్లారిటీ లేదు.కాని హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ మాత్రం వచ్చే నెల నుండి ఆచార్యతో జత కలిసే అవకాశం ఉంది అంటున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ విషయంలో పూర్తి సంతృప్తిగా మేకర్స్‌ ఉన్నారట.పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా బయట నుండి లోనికి రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు.

మొత్తానికి ఆచార్య సినిమా షూటింగ్‌ ఓ రేంజ్‌ లో జోరుగా సాగుతుంది.సంక్రాంతికి అప్‌ డేట్‌ ఏమైనా ఇచ్చేనో చూడాలి.

#Ram Charan #Chiranjeevi #Acharya #Kajal Agarwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chiranjeevi Kajal Agarwal Acharya Movie Shooting Update Related Telugu News,Photos/Pics,Images..