లూసీఫర్‌ పనులు మొదలయ్యాయి... ఇక చిరు ఎంట్రీ

మలయాళం సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ హీరోగా నటించిన లూసీఫర్ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది.ఆ సినిమా ను రీమేక్ చేయాలని గత రెండేళ్లుగా చిరంజీవి కోరికతో ఉన్నాడు.

 Chiranjeevi Joins Malayalam Movie Lucifer Remake Shooting-TeluguStop.com

కథను మొదట సుజీత్ చేతిలో పెడితే ఆయన చిరంజీవికి తగ్గట్లుగా స్క్రీన్‌ ప్లేను రాయడంలో విఫలం అయ్యాడు.అందుకే ఆ సినిమా బాధ్యతను తమిళ దర్శకుడు మోహన్‌ రాజాకు ఇవ్వడం జరిగింది.

ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ఏర్పాట్లు జరుగుతున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం లూసీఫర్‌ తెలగు రీమేక్‌ కోసం భారీ సెట్టింగ్‌ ను నిర్మిస్తున్నారట.

 Chiranjeevi Joins Malayalam Movie Lucifer Remake Shooting-లూసీఫర్‌ పనులు మొదలయ్యాయి… ఇక చిరు ఎంట్రీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయిదు కోట్ల తో నిర్మిస్తున్న ఆ సెట్టింగ్‌ లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లుగా చెబుతున్నారు.సినిమా షూటింగ్ కు చిరంజీవి ఎప్పుడు జాయిన్‌ అవుతాడు అనేది ప్రస్తుతం అందరు వెయిట్‌ చేస్తున్నారు.

లూసీఫర్‌ సినిమా షూటింగ్‌ ను వచ్చే నెలలో చిరంజీవి మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చిరంజీవి బర్త్‌ డే కు లూసీఫర్ తెలుగు రీమేక్ ఫస్ట్‌ లుక్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

అప్పటి వరకు సినిమా షూటింగ్‌ ను ప్రారంభిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు.ఈ నెలలోనే ఆచార్యకు గుమ్మడి కాయ కొట్ట బోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాస్త అటు ఇటు అయినా షూటింగ్‌ ను వారం పది రోజుల్లో ముగిస్తారని అంటున్నారు.

Telugu Chiranjeevi, Chiranjeevi Lucifer, Lucifer, Lucifer Remake, Malayalam Lucifer-Movie

ఇప్పటి వరకు చివరి షెడ్యూల్‌ అప్ డేట్‌ లేక పోవడంతో ఎప్పుడు గుమ్మడి కాయ కొడుతారు అనేది క్లారిటీ లేదు.చరణ్‌ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ ను ముగించుకున్నట్లుగా తెలుస్తోంది.చిరంజీవి మరియు ఇతర యూనిట్‌ సభ్యులపై కొరటాల షూటింగ్‌ చేస్తున్నాడట.

#Lucifer #Chiranjeevi #Lucifer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు