ఇండస్ట్రీలో పెద్ద చిరంజీవి ఒక్కడే కాదు.. చాల మంది ఉన్నారు!

ఈ సారి మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగాయి.మునుపెన్నడూ లేనివిధంగా ఒకరి మీద ఒకరు చేసుకున్న విమర్శల దాడి ఎన్నికల వేడిని ఇంకా పెంచింది.

 Chiranjeevi Is Not The Big In The Industry There Are Many-TeluguStop.com

ఇదిలా ఉండగా రెండు ప్యానెల్ అభ్యర్థులు కూడా ప్రచారం చేయటంలో తమ వంతు సహకారాన్ని అందించారు.ఇకపోతే నటుడు నరేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రతి సంస్థలో కూడా తరాలు మారుతాయి.ఆలోచనలు మారుతాయి.ఆచరణలు ఎప్పుడూ ఉండాలి.అది పొలిటికల్ పార్టీ అయినా సేవ సంస్థ అయినా.

 Chiranjeevi Is Not The Big In The Industry There Are Many-ఇండస్ట్రీలో పెద్ద చిరంజీవి ఒక్కడే కాదు.. చాల మంది ఉన్నారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మా అనేది ఒక సేవా సంస్థ.ఎంతో మంది మహానుభావులు వచ్చి దీన్ని ఇటుగా తీసుకెళ్లారు.మొదటి సారి పోటీ చేశాం.భారత దేశంలో ఎవరూ చేయనంత వరకూ వెళ్ళాం అని నటుడు నరేశ్ తెలిపారు.

Telugu Chiranjeevi, Film Industry, Hero, Maa Elections, Manchu Vishnu, Naresh, Naresh Comments, Tollywood-Movie

ఇదిలా ఉండగా పాతికేళ్ల‌లో ఎన్న‌డూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జ‌రిగింది.ఓటింగ్‌కు వ‌చ్చిన స‌భ్యులను చూసి ఓటింగ్‌ను మ‌రో గంట పాటు పొడిగించారు.ఇలా ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో విష్ణు మంచు ప్యానెల్ నుంచి 10 మంది విజ‌యం సాధించ‌గా, ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ నుంచి 8 మంది విజ‌యం సాధించారు.ఇలా గత కొద్ది రోజుల నుంచి ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగిన ఈ ఎన్నికలలో విజయం మంచు విష్ణుకు దక్కిందని నరేష్ వెల్లడించారు ఈ క్రమంలోనే ఆయన సినీ పెద్దల గురించి కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది పెద్దలు ఉన్నారని కేవలం చిరంజీవి ఒక్కరే కాదంటూ ఈ సందర్భంగా నరేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి

.

#MAA #Chiranjeevi #Naresh #Manchu Vishnu #Naresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు