'పుష్ప' లో మెగాస్టార్‌ గెస్ట్‌ అప్పియరెన్స్ నిజమేనా?

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప సినిమా పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను రెండు పార్ట్‌ లుగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా ఇప్పటికే ప్రకటించారు.

 Chiranjeevi In Allu Arjun And Sukumar Movie Pushpa-TeluguStop.com

ఇక ఈ సినిమా రేంజ్ ను పెంచేందుకు సాధ్యం అయినంతగా ప్రయత్నాలు చేస్తున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో మెగా స్టార్ చిరంజీవి కనిపించబోతున్నాడట.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా లో చిరంజీవి నటించడానికి కారణం ఉంది.అదేంటీ అంటే చిరంజీవి త్వరలో మైత్రి మూవీ మేకర్స్ లో ఒక సినిమా ను చేయాల్సి ఉంది.

 Chiranjeevi In Allu Arjun And Sukumar Movie Pushpa-పుష్ప’ లో మెగాస్టార్‌ గెస్ట్‌ అప్పియరెన్స్ నిజమేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ సినిమా షూటింగ్‌ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందంటున్నారు.ఇక మైత్రి వారి సినిమా నే అవ్వడం వల్ల పుష్ప లో చిరంజీవి కనిపించే అవకాశం ఉందంటున్నారు.

Telugu Allu Arjun, Chiranjeevi In Pushpa, Film News, Pushpa, Rashmika Mandanna-Movie

పుష్ప లో ఒక పాత్రలో కాకుండా చిరంజీవి వింటేజ్ లుక్‌ లో పాటలో కనిపించబోతున్నాడట.అందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగి పోయాయి.సుకుమార్‌ దర్శకత్వం లో నటించాలనే కోరిక చిరంజీవి కి కూడా ఉంది.ఆ కోరిక ఇలా తీర్చుకుంటున్నాడా అనేది కూడా చూడాలి.పాటలో బన్నీ తో కలిసి చిరంజీవి రెండు స్టెప్పులు వేయబోతున్నాడు.ఖచ్చితంగా పుష్పలో చిరంజీవి ఎంట్రీ ఉంటుందని.

అది సినిమా స్థాయిని మరింతగా పెంచుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం సినిమా షూటింగ్‌ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులు వాయిదా వేసిన చిత్ర యూనిట్‌ సభ్యులు వచ్చే వారం నుండి షూటింగ్‌ ను మొదలు పెట్టి అనుకున్న తేదీకి అంటే ఆగస్టు లో సినిమా ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమా లో కీలక పాత్రను ఫహద్ ఫాజిల్‌ పోషిస్తున్నాడు.

#ChiranjeeviIn #Allu Arjun #Pushpa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు