పవన్ డైరెక్టర్ తో చిరంజీవి.. వినాయక్ కు ఝలక్..?

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్ల పాటు సినిమాలకు దూరమైన మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో వరుస విజయాలతో సినిమాసినిమాకు తన రేంజ్ ను మరింత పెంచుకుంటున్న సంగతి తెలిసిందే.తనకు ఠాగూర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వీవీ వినాయక్ తో కత్తి రీమేక్ ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా చిరంజీవి రీఎంట్రీ ఇచ్చారు.

 Chiranjeevi Huge Shock To Director Vv Vinayak-TeluguStop.com

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఖైదీ నంబర్ 150 తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి సైరా సినిమాలో నటించగా ఆ సినిమా కూడా హిట్ ఫలితాన్ని అందుకుంది.

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాలో రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తైన తరువాత లూసిఫర్, వేదాళం రీమేక్ లలో చిరంజీవి నటించనున్నారు.చిరంజీవి లూసిఫర్ సినిమా రీమేక్ లో నటిస్తారని వార్త వచ్చినప్పటి నుంచి ఈ రీమేక్ కు దర్శకునిగా వీవీ వినాయక్ పేరు వినిపించింది.

 Chiranjeevi Huge Shock To Director Vv Vinayak-పవన్ డైరెక్టర్ తో చిరంజీవి.. వినాయక్ కు ఝలక్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో ఫ్యాన్స్ కూడా లూసిఫర్ రీమేక్ కు వినాయక్ దర్శకత్వం వహిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

అయితే ఏం జరిగిందో తెలీదు కానీ ఊహించని విధంగా ఈ సినిమాకు డైరెక్టర్ గా హరీష్ శంకర్ పేరు తెరపైకి వచ్చింది.పవన్ కు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ మెగాఫ్యామిలీ హీరోలైన అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్ లతో సినిమాలు తీసి హిట్లు కొట్టారు.ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే పవన్ వరుస కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారు.

హరీష్ శంకర్ ప్రస్తుతం ఖాళీగానే ఉండటంతో లూసిఫర్ రీమేక్ కు హరీష్ సైతం అంగీకరించే అవకాశం ఉంది.

త్వరలో ఈ మేరకు అధికారిక ప్రకటన రానుందని సమాచారం.వచ్చే ఏడాది లూసిఫర్ రీమేక్ షూటింగ్ మొదలు కానుందని సమాచారం.

#Vinayak #Chiranjeevi #Harish Shankar #Loosifer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు