చిరుతో చేసేందుకు ఎదురు చూస్తున్న బిగ్‌బాస్‌ బ్యూటీ

మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో నటించాలని అందరు కోరుకుంటూ ఉంటారు.మెగా మూవీలో కనీసం ఒక్క చిన్న పాత్ర అయినా చేయాలని అంతా అనుకుంటారు.

 Big Boos Himaja Act In Chiranjeevi Acharya Movie, Big Boss, Himaja, Acharya, Chi-TeluguStop.com

అలాంటి సదావకాశంను బిగ్‌బాస్‌ ఫేమ్‌ హిమజా దక్కించుకుంది.చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్‌ దక్కించుకున్న హిమజా షూటింగ్‌లో జాయిన్‌ అవ్వాలని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది.

షూటింగ్‌ మళ్లీ ప్రారంభం అయిన వెంటనే హిమజా ఆచార్యలో నటించబోతుంది.

ఈ విషయాన్ని స్వయంగా హిమజా చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తాను మెగాస్టార్‌ చిరంజీవి మూవీలో నటించేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.షూటింగ్‌ ప్రారంభం అయిన వెంటనే తన పార్ట్‌ షూట్‌ ఉంటుందని ఇన్ఫర్మేషన్‌ వచ్చిందని చెప్పిన హిమజా చిరంజీవి గారితో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.

Telugu Acharya, Big Boss, Chiranjeevi, Himaja, Koratala Siva, Tollywood-Movie

మెగాస్టార్‌ మూవీలో నటించడం వల్ల ఖచ్చితంగా మంచి మైలేజ్‌ వచ్చి రాబోయే రోజుల్లో మరిన్ని ఆఫర్లు వస్తాయనే నమ్మకంతో ఈ అమ్మడు ఎదురు చూస్తోంది.ప్రస్తుతం ఈ అమ్మడు పలు బుల్లి తెర షోల్లో నటించడంతో పాటు, సీరియల్స్‌లో కూడా మెరుస్తూ వస్తోంది.ఇకపై సినిమాలతో కూడా ఈమె బిజీ అవ్వనుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube