సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు సృష్టించిన చిరంజీవి... అదేంటంటే?

ప్రస్తుతం ప్రపంచమంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది.సాంకేతిక విప్లవం తరువాత సోషల్ మీడియా ప్రపంచాన్ని నడిపించే ఓ గొప్ప సాధనంగా మారింది.

 Chiranjeevi Has Created A New Record On Social Media Is That So-TeluguStop.com

సోషల్ మీడియా అనేది ఒక గొప్ప ప్లాట్ ఫార్మ్.కానీ దీనిని మంచికి వినియోగిస్తే చాలా గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టవచ్చు.

చెడుకు వినియోగిస్తే ఇక జరిగే నష్టం మన చేతుల్లో ఉండదు.ఎందుకంటే సోషల్ మీడియాను నియంత్రించడం ఎవరి వల్లా సాధ్యం కాదు.

 Chiranjeevi Has Created A New Record On Social Media Is That So-సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు సృష్టించిన చిరంజీవి… అదేంటంటే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దానిని వాడటంలో స్వేచ్ఛ ఉంది కాబట్టే సోషల్ మీడియా అడిక్ట్ అవుతున్న వారు రోజురోజుకు పెరుగుతున్నారు.అయితే సెలెబ్రెటీలు సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు.

ఇక రోజు వారీ పోస్ట్ లు చేస్తూ, అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటూ, వాళ్ళ అభిప్రాయాలను సైతం వింటూ, వారితో డైరెక్ట్ గా కాకున్నా సోషల్ మీడియా ద్వారా ఎక్కువ టచ్ లో ఉంటారనే చెప్పవచ్చు.ఆ కోవలోకే వస్తారు మెగాస్టార్ చిరంజీవి.

సోషల్ మీడియాలోకి రావడం కొద్దిగా లేట్ అయినా ఇప్పుడు అందరికంటే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.సోషల్ మీడియాను చాలా మంచి విధానంలో వినియోగిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.

ఎవ్వరు ఏ మంచి పని చేసినా వారిని సోషల్ మీడియాలో అభినందిస్తూ సదరు వ్యక్తి కృషికి గుర్తింపు తీసుకొస్తాడు మెగాస్టార్ చిరంజీవి.అయితే చిరంజీవి సినిమా రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, సోషల్ మీడియాలోనూ రికార్డులను బద్దలు కొడుతున్నాడు.

తాజాగా ట్విట్టర్ లో మెగాస్టార్ చిరంజీవిని 1 మిలియన్ మెంబర్స్ ఫాలో అవుతున్నారు.ఇంస్టాగ్రామ్ లో ఇప్పటికే 1.4 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు