యాక్టింగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి మనవరాలు.. డ్యాన్స్ చూస్తే ఫిదా అంటూ?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో అఖండ విజయాలను సొంతం చేసుకుని ఆరు పదుల వయస్సులో కూడా ఎంతో ఎనర్జీతో వరుస సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

గాడ్ ఫాదర్ సినిమా ఆశించిన రిజల్ట్ ను అందుకోకపోయినా చిరంజీవి స్ట్రెయిట్ సినిమాలలో నటిస్తే కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ కావడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తుండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన బాస్ పార్టీ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.మొదట ఈ సాంగ్ గురించి నెగిటివ్ కామెంట్లు వినిపించినా ఆ తర్వాత ఈ సాంగ్ అంచనాలకు మించి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం ద్వారా అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

చిరంజీవి మనవరాలు సంహిత గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూతురు సంహిత అనే సంగతి తెలిసిందే.

Chiranjeevi Grand Daughter Samhitha Dance To Boss Party Song Details, Chiranjeev

సంహిత చిరంజీవితో కలిసి బాస్ పార్టీ సాంగ్ కు స్టెప్పులు వేయగా సుస్మిత ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ వీడియోకు ఏకంగా 17000కు పైగా లైక్స్ వచ్చాయి.రాబోయే రోజుల్లో సంహిత సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Advertisement
Chiranjeevi Grand Daughter Samhitha Dance To Boss Party Song Details, Chiranjeev

సంహిత డ్యాన్స్ కు ఫిదా అవుతున్నామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Chiranjeevi Grand Daughter Samhitha Dance To Boss Party Song Details, Chiranjeev

అయితే సంహిత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య జనవరి 13వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.

ఈ సినిమా నుంచి రవితేజ లుక్ రేపు ఉదయం విడుదల కానున్న సంగతి తెలిసిందే.

స్టార్ హీరో విజయ్ దేవరకొండ రికార్డును బ్రేక్ చేసిన నాని.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు