గూస్ బంప్స్ వచ్చేలా చిరంజీవి స్పీచ్.. పవన్ భావోద్వేగం.. వీడియో వైరల్!

సీనియర్ ఎన్టీఆర్ తర్వాత స్వయంకృషితో ఎదిగిన నటుడిగా చిరంజీవికి పేరుంది.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు, ఎన్నికల ఫలితాల తర్వాత చిరంజీవి పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

 Chiranjeevi Goose Bumps Speech Video Goes Viral In Social Media-TeluguStop.com

సినిమాల ద్వారా, కలెక్షన్ల ద్వారా చిరంజీవి ఖాతాలో ఎన్నో రికార్డులు చేరాయి.కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న చిరంజీవి మృదు స్వభావిగా పేరు తెచ్చుకున్నారు.

ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరినీ చిరంజీవి కుటుంబ సభ్యులలా చూస్తారు.

 Chiranjeevi Goose Bumps Speech Video Goes Viral In Social Media-గూస్ బంప్స్ వచ్చేలా చిరంజీవి స్పీచ్.. పవన్ భావోద్వేగం.. వీడియో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే చిరంజీవి ఎన్ని మంచి పనులు చేసినా కొంతమంది మాత్రం ఆయనపై విమర్శలు చేస్తూనే ఉంటారు.

కరోనా ఫస్ట్ సేవ్, సెకండ్ వేవ్ సమయంలో చిరంజీవి ఎంతోమందికి ఆర్థిక సహాయం అందించారు.సొంతంగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ను స్థాపించి వాటి ద్వారా చిరంజీవి ఆరోగ్యపరమైన సమస్యలతో బాధ పడుతున్న ఎంతోమందిని ఆదుకుంటున్నారు.

అయితే టాలీవుడ్ ఉన్నతస్థాయిలో ఉండాలని కోరుకునే నటులలో చిరంజీవి కూడా ఒకరు.

గతంలో చిరంజీవి టాలీవుడ్ గురించి మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా చిరంజీవి మాట్లాడగా చిరంజీవి మాటలను విన్న పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురి కావడంతో పాటు చిరంజీవిని కౌగిలించుకున్నారు.తాను చదివిన చదువుకు, పెరిగిన పరిస్థితులకు, వచ్చిన అవార్డులకు ఎక్కడా పొంతన లేదని చిరంజీవి చెప్పుకొచ్చారు.

గొప్పలు పోవడానికి కళామతల్లి ఫ్లాట్ ఫామ్ ఇచ్చిందని చిరంజీవి తెలిపారు.నటులు డౌన్ టు ఎర్త్ ఉండాలని కెరీర్ తొలినాళ్లలో చిన్న పాత్ర వస్తే సంతోషించేవాళ్లమని చిరంజీవి అన్నారు.గోవా, న్యూఢిల్లీ, బాంబే ఫంక్షన్లకు వెళితే అక్కడ మనకు గుర్తింపు లేదని అక్కడ ఎన్టీఆర్, ఏఎన్నార్ ఫోటోలు లేవని చిరంజీవి చెప్పుకొచ్చారు.పేపర్ లో మన పేరు రాస్తారని ప్రతివాళ్లు పేపర్ ఎక్కుతున్నారని మనమంతా కలిసి ఉండాలని చిరంజీవి పేర్కొన్నారు.

#Fans #Eye Bank #Pawan Kalyan #Speech #Goosebumps

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube