చిరు కొత్త పొలిటిక‌ల్ స్టెప్ ఇదే   Is Chiranjeevi GoodBye To Congress..?     2017-01-09   23:40:22  IST  Raghu V

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో ప‌దేళ్ల త‌ర్వాత రేపు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ సినిమ త‌ర్వాత చిరు త‌న 151వ సినిమాను సైతం ప‌ట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇలా వెండితెర రీ ఎంట్రీని గ్రాండ్‌గా స్టార్ట్ చేసిన చిరు త‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌ను కూడా స‌రైన ట్రాక్‌లో పెట్టుకునేందుకు ప్లాన్స్ వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి పొలిటిక‌ల్‌గా ఫ‌ట్ అయిన చిరు త‌ర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆ పార్టీ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌వ్వ‌డంతో పాటు కేంద్ర‌మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఇక ప్ర‌స్తుతం చిరు పొలిటిక‌ల్‌గా కాంగ్రెస్‌లో ఉన్నారా ? లేదా ? అన్న డౌట్లు కూడా క‌లుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అస‌లు ఏపీలో ఎలాంటి ఫ్యూచ‌ర్ ఉందో ? ఎప్ప‌ట‌కీ అర్థం కావ‌డం లేదు.

ఇక అటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ రోజు రోజుకు దిగ‌జారుతోంది. ఈ క్ర‌మంలోనే చిరు పొలిటిక‌ల్‌గా త‌న ఫ్యూచ‌ర్ ప్లాట్ ఫాం రెడీ చేసుకునే ప‌నిలో ఉన్నార‌ని, ఖైదీ నెంబ‌ర్ 150 ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌లో ఈ సిగ్న‌ల్స్ వ‌చ్చిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. గుంటూరు స‌మీపంలోని హాయ్‌లాండ్‌లో జ‌రిగిన ఈ ప్రీ రిలీజ్ ఈ ఫంక్ష‌న్‌కు ఏపీ మంత్రులు ప్ర‌త్తిపాటి పుల్లారావుతో పాటు కామినేని శ్రీనివాస్ వ‌చ్చారు.

ఇటీవ‌ల చిరు బీజేపీలో చేర‌తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే వాటిని చిరు ఖండించ‌డం కూడా జ‌రిగింది. ఇటీవ‌ల ఏపీలో కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టే ఏ కార్య‌క్ర‌మానికి కూడా చిరు హాజ‌రు కావ‌డం లేదు. ఇక చిరు ఖైదీ 150 ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌కు బీజేపీ మంత్రి కామినేని హాజ‌రు కావ‌డంతో చిరు పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌పై ఊహాగానాలు జోరందుకున్నాయి.

చిరు బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ సైతం ఏపీలో కాపుల ద్వారా ఇక్క‌డ పునాది కోసం ట్రై చేస్తోంది. ఖైదీ రిలీజ్ అయ్యాక చిరు బీజేపీ ఎంట్రీపై ప్ర‌క‌ట‌న చేస్తార‌ని తెలుస్తోంది.