'గాడ్ ఫాదర్' టైటిల్ పోస్టర్ ను విడుదల.. మెగా లుక్ అదుర్స్ !

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వేగంగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు.

 Chiranjeevi Godfather Title Poster Released,megastar Chiranjeevi, Lucifer Movie,-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఇందులో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ సినిమాలో చిరంజీవి కి జంటగా కాజల్ అగర్వాల్.రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవి రెండు రీమేక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.మలయాళ బ్లాక్ బస్టర్ సినిమా లూసిఫర్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.

అయితే రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేసారు.ఎప్పటి నుండో ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ అనుకుంటున్నట్టు రూమర్స్ వస్తున్నాయి.

అనుకున్నట్టుగానే ఈ సినిమాకు గాడ్ ఫాదర్ టైటిల్ కన్ఫర్మ్ చేసారు.అదే పేరుతొ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.

మెగాస్టార్ అభిమానులకు ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ చాలా బాగా నచ్చింది.టైటిల్ తో పాటు చిరు లుక్ కూడా రివీల్ చెయ్యడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఈ పోస్టర్ లో మెగాస్టార్ లుక్ మొత్తం రివీల్ చెయ్యలేదు.చిరంజీవి ఈ పోస్టర్ లో చేతిలో గన్ పట్టుకుని కాప్ పెట్టుకుని వెనుక వైపుకు తిరిగి ఉన్నాడు.

Telugu Acharya, Kajal Agarwal, Latest, Lucifer, Chiranjeevi, Ram Charan, Poster,

ఈ పోస్టర్ చాలా క్రియేటివిటీగా ఉంది.ఇందులో గాడ్ ఫాదర్ లో A లెటర్ లో చిరంజీవి పిక్ పెట్టారు.ఇది చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.మొత్తానికి చిరంజీవి పుట్టిన రోజు సర్ప్రైజ్ లు ఈ రోజు నుండే స్టార్ట్ అయ్యాయి.ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించ బోతున్నారు.

ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube