గాడ్‌ఫాదర్‌ ప్రకటనతో ఆ విషయంలో కన్ఫ్యూజన్‌

మెగా స్టార్‌ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతున్న విషయం తెల్సిందే.హీరోగా చిరంజీవి ఇంత స్పీడ్ గా సినిమా లు చేయడం గతంలో ఎప్పుడు జరగలేదు అనుకుంటూ ఉండగా అనూహ్యంగా ఆచార్య సినిమా డిజాస్టర్‌ అవ్వడంతో ఆయన సినిమాల జోరు తగ్గింది.

 Chiranjeevi Godfather Movie First Look Interesting Update Chiranjeevi , Godfather , First Look, Bholashanker , Bobby , Maher Ramesh, Tollywood, Nayanatara-TeluguStop.com

ఇప్పటికే మొదలు పెట్టిన గాడ్‌ ఫాదర్‌.భోళా శంకర్ సినిమాలతో పాటు వాల్తేరు వీరయ్య ఇంకా వెంకీ కుడుమల దర్శకత్వంలో సినిమా లన్నీంటి విషయంలో కాస్త గందరగోళం ఏర్పడింది.

ఏ సినిమా ఎప్పుడు వస్తుంది… అసలు అన్ని సినిమాలు కూడా వస్తాయా లేదా అంటూ చర్చ మొదలు అయ్యింది.ఈ సమయంలో వాల్తేరు వీరయ్య సినిమా యొక్క విడుదల విషయంలో స్పష్టత ఇస్తూ యూనిట్‌ సభ్యులు విడుదల చేసిన ప్రకటన గాడ్‌ ఫాదర్ మరియు భోళా శంకర్ సినిమా యొక్క విడుదల పై అనుమానాలు కలిగేలా చేసింది.

 Chiranjeevi Godfather Movie First Look Interesting Update Chiranjeevi , Godfather , First Look, Bholashanker , Bobby , Maher Ramesh, Tollywood, Nayanatara-గాడ్‌ఫాదర్‌ ప్రకటనతో ఆ విషయంలో కన్ఫ్యూజన్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి వస్తే మరి ఈ సినిమాలు వచ్చేది ఎప్పుడు అంటూ అంతా కూడా చర్చించుకుంటున్నారు.ఈ సమయంలో గాడ్‌ ఫాదర్‌ సినిమా కు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

దాంతో గాడ్‌ ఫాదర్‌ ను ఇదే ఏడాది లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయా.భోళా శంకర్‌ సినిమా ఎప్పుడు అంటూ మళ్లీ కన్ఫ్యూజన్‌ మొదలు అయ్యింది.

ఈ కన్ఫ్యూజన్ కు నేడు గాడ్ ఫాదర్‌ యొక్క ఫస్ట్‌ లుక్ వస్తే అంతా క్లారిటీ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో చిరు సినిమాల విడుదల విషయమై జరుగుతున్న చర్చకు ఒక ఫుల్‌ స్టాప్ పడాలంటే గాడ్‌ ఫాదర్‌ ఫస్ట్‌ లుక్ రావాలంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube