గాడ్ ఫాదర్ మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే.. ఉమైర్ సంధు రేటింగ్ ఎంతంటే?

చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది.లూసిఫర్ సినిమాను చూసినా గాడ్ ఫాదర్ నచ్చుతుందని మోహన్ రాజా కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నారు.

 Chiranjeevi God Father Movie First Review Details, God Father, Chiranjeevi, God-TeluguStop.com

అయితే ప్రతి సినిమా రిలీజ్ కు ముందు రివ్యూలు ఇచ్చి ప్రేక్షకుల చేత తిట్టించుకునే ఉమైర్ సంధు ఈ సినిమాకు కూడా రివ్యూ ఇచ్చారు.మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.

గాడ్ ఫాదర్ మూవీ యావరేజ్ మూవీ అని బీ, సీ ఆడియన్స్ కు మాత్రమే ఈ సినిమా నచ్చుతుందని ఉమైర్ సంధు పేర్కొన్నారు.కొత్త సీసాలో పాత సారా అనే విధంగా ఈ సినిమా ఉందని ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు.

చిరంజీవి గారు దయచేసి విశ్రాంతి తీసుకోవాలని కంటెంట్ ఉన్న సాలిడ్ స్క్రిప్ట్ ను చిరంజీవి ఎంచుకోవాలని ఉమైర్ సంధు సూచనలు చేశారు.మాస్ హీరో అని ప్రజల మనిషి అని చెప్పుకునే పాత్రల నుంచి చిరంజీవి బయటకు రావాలని ఉమైర్ సంధు అన్నారు.

చెత్త స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకుని మీ ప్రతిభను వృథా చేసుకోవద్దని ఉమైర్ సంధు చిరంజీవికి సూచనలు చేశారు.

మీరు మెగాస్టార్ అని మీ కథల ఎంపికలో మాత్రం అది కనిపించట్లేదని ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు.అయితే ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూపై చిరంజీవి అభిమానులు మండిపడుతున్నారు.సినిమా విడుదలకు ముందే నెగిటివ్ గా రివ్యూలు ఇచ్చే అధికారం ఉమైర్ సంధుకు ఎక్కడిదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఉమైర్ సంధు బ్లాక్ బస్టర్ అని చెప్పిన సినిమాలు సైతం గతంలో డిజాస్టర్లు అయ్యాయని ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు వెల్లడిస్తున్నారు.బాక్సాఫీస్ వద్ద గాడ్ ఫాదర్ ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.గాడ్ ఫాదర్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం ఉమైర్ సంధుకు సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోలింగ్ తప్పదని చెప్పవచ్చు.ఈ సినిమాకు ఉమైర్ సంధు 2కు 1 రేటింగ్ ఇవ్వడం గమనార్హం.

Chiranjeevi God Father Movie First Review by Umair Sandhu

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube