'గాడ్‌ ఫాదర్‌' ఫస్ట్‌ డే టార్గెట్‌ ఏంతో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తారీఖున దసరా సందర్భం గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.నేడు సినిమా కు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో లాంచనంగా జరుగుతుంది.

 Chiranjeevi God Father Movie First Day Collections Target ,chiranjeevi , God F-TeluguStop.com

నేడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ కూడా ఉంటుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.ఇక ఈ సినిమా దాదాపుగా 200 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అంటూ టాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడు పోయిన కారణం గా కచ్చితంగా ఈ సినిమా 100 కోట్ల రూపాయల షేర్ వసూలను దక్కించుకోవలసి ఉంటుంది.ఆ స్థాయి కలెక్షన్స్ రాబట్టాలి అంటే మొదటి రోజే ఈ సినిమా 20 నుండి 25 కోట్ల రూపాయల షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది.

కేవలం తెలుగు భాష లోనే కాకుండా మలయాళం, తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కాబోతుంది, కనుక కాస్త పాజిటివ్ టాక్ దక్కించుకుంటే ఆ కలెక్షన్స్ రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, కానీ మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో పాజిటివ్ టాక్ దక్కించుకుంటాడా లేదా అనేది అనుమానం, చిరంజీవి గత చిత్రం ఆచార్య మొత్తం కలెక్షన్స్ కూడా పాతిక కోట్ల రూపాయలు లేవు, కానీ ఈ సినిమా కు మాత్రం మొదటి రోజే ఆ స్థాయిలో కలెక్షన్స్ ఆశించడం కాస్త ఓవర్ అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, ఏది ఏమైనా గాడ్ ఫాదర్ సినిమా భారీ వసులను నమోదు చేయాలంటూ మెగా అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.అది ఎంత వరకు సాధ్యమో అక్టోబర్ 5 వ తారీఖున దసరా రోజు సినిమా వస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube