రామ్ చరణ్ తో గ్యాంగ్ లీడర్ రీమేక్! రైట్స్ తీసుకున్న బడా నిర్మాత

మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో గ్యాంగ్ లీడర్ ఒక బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన సంగతి అందరికి తెలిసిందే.అతని కెరియర్ లో గ్యాంగ్ లీడర్ చాలా ప్రత్యేకమైన సినిమా అని చిరంజీవి కూడా చాలా సందర్భాలలో చెప్పారు.

 Chiranjeevi Gang Leader Remake With Ram Charan, Megastar, Mega Family, Gang Lead-TeluguStop.com

విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా అప్పట్లో ఇండస్ట్రీలో అతి పెద్ద హిట్ బొమ్మగా నిలబడి అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకుంది.ఇక ఆ సినిమాని రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేస్తే బాగుంటుంది అని చిరంజీవి చాలా సందర్భాలలో తన అభిప్రాయం తెలియజేశారు.

ఇక సాయి ధరమ్ తేజ్ కూడా గ్యాంగ్ లీడర్ సినిమా రీమేక్ పై మనసు పడ్డాడు.ఇక రామ్ చరణ్ కూడా ఆ సినిమా ప్రస్తావన చాలా సందర్భాలలో తీసుకొచ్చారు.

అయితే ఇప్పుడు ఈ గ్యాంగ్ లీడర్ రీమేక్ త్వరలో రామ్ చరణ్ హీరోగా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ గ్యాంగ్ రీమేక్ హక్కులని సొంతం చేసుకొని చిరంజీవిని కలవడం జరిగిందని టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్.

ఇక చిరంజీవి కూడా ఈ కథలో కొన్ని మార్పులు చేసి ప్రెజెంట్ నేటివిటీకి తగ్గట్లు మార్చే ప్రయత్నం చేస్తే రామ్ చరణ్ తో చేద్దామని నిర్మాతలకి మాట ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.మంచి కమర్షియల్ దర్శకుడుకి ఈ సినిమా బాధ్యతలు అప్పగించి స్క్రిప్ట్ వర్క్ చేపించమని ఆర్ఆర్ఆర్ సినిమా తర్వత సెట్స్ పైకి తీసుకెళ్ళే విధంగా ప్లాన్ చేయాలని సూచించినట్లు సమాచారం.

ఇక దీనికి సంబందించిన రామ్ చరణ్ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేసే అవకాశం ఉందని బోగట్టా.మరి మెగాస్టార్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన గ్యాంగ్ లీడర్ రీమేక్ చేస్తే రామ్ చరణ్ కి కూడా సాలిడ్ హిట్ అవుతుందా లేకా అనవసర ప్రయత్నంగా మిగిలిపోతుందా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube