వామ్మో.. షూటింగ్ మధ్యలోనే చిరంజీవి సినిమాలు ఇన్ని ఆగిపోయాయా?

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఎవరూ ఉండరు.ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు.

 Chiranjeevi Halted Movies ,chiranjeevi, Vinalani Undi, Bhuloka Veerudu, Abu Bagh-TeluguStop.com

ఎలాంటి పాత్రలో అయినా అద్బుతంగా నటిస్తారు.తన డాన్సులతో ఎంతగానో అలరిస్తాడు.

ఎన్నో ఆవేశపూరిత, ఉద్వేగపూరిత భావోద్వేగాలతో తన నటనని చూపిస్తుంటాడు మెగాస్టార్ చిరంజీవి.

చిరంజీవి గారు 1978న సినీ రంగంలోకి ప్రవేశించి అప్పటి నుంచి ప్రస్తుతం వరకు తన ఎన్నో సినిమాల్లో ఎంతో అద్భుతంగా నటించాడు.

అయితే చిరంజీవి తన కెరీర్ లో కొన్ని సినిమాలు సమయం లేక ఒదులుకోగా కొన్ని సినిమాలకు షూటింగ్ ప్రారంభం అయినప్పటికి మధ్యలోనే ఆగిపోయాయి.ఆ సినిమాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

Telugu Abubaghdad, Auto Jani, Bhuloka Veerudu, Chiranjeevi, Vinalani Undi-Movie

ఖైదీ నెంబర్ 150 కంటే ముందు చిరంజీవి గారు పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో “ఆటోజానీ” సినిమాకు సిద్దమయ్యాడు కానీ ఆ సినిమా చివరి దశలో ఆగిపోయింది.ఈ సినిమా రెండవ భాగం ఆసక్తిగా లేనందున చిరంజీవి గారు ఈ చిత్రంను పక్కన పెట్టారు.కానీ ప్రస్తుతం చిరంజీవి గారు ఆటోజానీపై ఆసక్తి పెట్టగా అందులో రెండవ భాగం ఖైదీ నెంబర్ 150 కథకు అనుకూలంగా పెట్టమని పూరి జగన్నాథ్ ను కోరారు.కానీ దర్శకుడుకు పూరీ జగన్నాథ్ అందుకు ఒప్పుకోలేదు.

Telugu Abubaghdad, Auto Jani, Bhuloka Veerudu, Chiranjeevi, Vinalani Undi-Movie

హాలీవుడ్ లో హిట్ అయినా ఓ సూపర్ హిట్ సినిమాను తెలుగులో సురేష్ కృష్ణ గారి దర్శకత్వంలో “అబు – బాగ్దాద్ గజదొంగ” చిత్రం షూటింగ్ ప్రారంభం కాగా ఈ చిత్రం కూడా మధ్యలో ఆగింది.ఈ చిత్రం మొదలు పెట్టి 20 కోట్లు ఖర్చు పెట్టినప్పటిలో కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా ఆగిపోయింది.

Telugu Abubaghdad, Auto Jani, Bhuloka Veerudu, Chiranjeevi, Vinalani Undi-Movie

రామ్ గోపాల్ వర్మ, చిరంజీవి కాంభినేషన్ లో “వినాలని ఉంది” అనే పేరుతో చిత్రం మొదలు అవ్వగా ఆ సినిమాలో 2 పాటలను కూడా తెరకెక్కించారు.కానీ ఈ చిత్రం కూడా మధ్యలో ఆగింది.

Telugu Abubaghdad, Auto Jani, Bhuloka Veerudu, Chiranjeevi, Vinalani Undi-Movie

చిరంజీవి, సింగితం శ్రీనివాస్ దర్శకత్వంలో మంచి జానపద చిత్రం “భూలోక వీరుడు” ప్రారంభం కాగా ఇది కూడా మధ్యలో ఆగింది.

ఇన్ని సినిమాలు చిరంజీవి సినీ కెరీర్ లో ఆగిపోయాయి.ఇవి కూడా పూర్తయ్యి ఉంటే చిరంజీవి ఖాతాలో మరికొన్ని హిట్ సినిమాలు ఉండేవి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube