చిరు భయపడుతున్నాడా?

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమాను చేసేందుకు భయపడుతున్నట్లుగా అనిపిస్తోంది.ఎన్నో సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా సక్సెస్‌ అవ్వక పోతే మొదటికే మోసం వస్తుందని, రీ ఎంట్రీ గ్రాండ్‌గా, సక్సెస్‌తో ఉంటేనే ఇండస్ట్రీలో గౌరవం ఉంటుందని లేదంటే ప్రస్తుతం ఉన్న పేరు ప్రతిష్టలు కూడా దెబ్బ తింటాయని చిరు ఆలోచిస్తున్నట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

 Chiranjeevi Fear About 150th Movie-TeluguStop.com

అందుకే 150వ సినిమా కోసం వందల కొద్ది కథలు వింటున్నాడు.వేల ఆలోచనలు చేస్తున్నాడు, ఎందరినో దర్శకుడిగా పరిశీలిస్తున్నాడు.

దాదాపు రెండు సంవత్సరాలుగా చిరంజీవి 150వ సినిమా గురించి ప్రచారం పీక్స్‌లో వస్తుంది.ఆయన ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్‌ దాదాపు 7 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు.

ఇంత కాలం ఎదురు చూపులకు ఫలితం ఉండాలనే ఉద్దేశ్యంతో చిరంజీవి సక్సెస్‌ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు.ఆ క్రమంలోనే ఈ ఆలస్యం అవుతోంది.

‘అఖిల్‌’ విడుదల అయిన వెంటనే చిరంజీవి హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో సినిమా గురించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని అంతా భావించారు.కాని ఇప్పట్లో చిరు మూవీ లేదని అనిపిస్తోంది.

వచ్చే సంవత్సరం సంక్రాంతికి చిరు 150వ సినిమా ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని మెగా వర్గాల నుండి సమాచారం అందుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube