చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారని ఆశ కలిగించిన డైలాగ్ ఇదే..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో ఏకంగా 23 సినిమాలు తెరకెక్కగా మెజారిటీ సినిమాలు హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి.

 Chiranjeevi Fans Hopes On His Political Entry, Chiranjeevi, Fans Hope, Interesti-TeluguStop.com

చిరంజీవి కోదండ రామిరెడ్డి కాంబోలో చివరిగా వచ్చిన సినిమా ముఠామేస్త్రి కాగా ముఠామేస్త్రి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది.

సామాన్యుడైన కూలీగా పని చేసే వ్యక్తి సీఎం కావడం ముఠామేస్త్రి కాగా క్లాస్, మాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోవడం గమనార్హం.2008 సంవత్సరంలో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.అయితే అంతకు ముందునుంచే మెగాస్టార్ రాజకీయాల్లోకి రావాలని అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యేవి.

మెగాస్టార్ రాజకీయాల్లోకి వస్తారో.? రారో.? అనే కన్ఫ్యూజన్ అభిమానుల్లో ఉండేది.

Telugu Chiranjeevi, Fans Hope, Prajarajyam-Movie

అయితే ముఠామేస్త్రి సినిమాల్లో ఉన్న డైలాగ్ ద్వారా చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారని కన్ఫామ్ అయింది.పరచూరి బ్రదర్స్ ప్రజాస్వామ్యానికి ఎప్పుడైనా ప్రమాదం వాటిల్లితే పిలవాలని స్పీడై పోతానని చిరంజీవి చెప్పుకొచ్చారు.చిరంజీవి చెప్పిన డైలాగ్ ను విని ఆయన కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని అభిమానులు ఫిక్స్ అయ్యారు.

అయితే రాజకీయాల్లోకి మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో వైఎస్సార్ పాలనపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండటంతో చిరంజీవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

Telugu Chiranjeevi, Fans Hope, Prajarajyam-Movie

మొత్తం 294 స్థానాలలో కేవలం 18 స్థానాల్లో మాత్రమే చిరంజీవి విజయం సాధించారు.ఆ తర్వాత ప్రజారాజ్యంను కాంగ్రెస్ లో కలిపేసిన చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలతో బిజీ అయ్యారు.చిరంజీవి రాజకీయాల్లో కెరీర్ ను కొనసాగించి ఉంటే భవిష్యత్తులో కచ్చితంగా సీఎం అయ్యేవారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

చిరంజీవి రాజకీయాల్లోకి రాకపోయినా జనసేన పార్టీకి మద్దతు ఇస్తారని పవన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube