నేను చనిపోతే చిరంజీవి రావాలి.. మెగా లేడీ అభిమాని వింత కోరిక విన్నారా?

Chiranjeevi Fan Rajanala Nagalakshmi Comments Goes Viral In Social Media , Embroidery Work, Chiranjeevi, Nagalakshmi, Rajanala Nagalakshmi, Tollywood

మెగాస్టార్ చిరంజీవికి కోట్ల సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు.చిరంజీవి( Chiranjeevi ) సైతం ఫ్యాన్స్ కోసం వయస్సు పెరుగుతున్నా సినిమాలలో కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

 Chiranjeevi Fan Rajanala Nagalakshmi Comments Goes Viral In Social Media , Embr-TeluguStop.com

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వయస్సు 67 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.చిరంజీవి వీరాభిమానులలో రాజనాల నాగలక్ష్మి ఒకరు కాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

రాజనాల నాగలక్ష్మి( Rajanala Nagalakshmi ) చిరంజీవి తల్లి పేరుపై ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేశారు.చిరంజీవి ఎప్పుడూ చరణ్ ఎదుగుదలను కోరుకున్నాడని ఆమె తెలిపారు.

చరణ్ మంచివాడని నాతో ఐదారుసార్లు మాట్లాడాడని నాన్నను మించి చరణ్ ఎదగాలని కోరుకుంటున్ననని ఆమె చెప్పుకొచ్చారు.నేను మూడేళ్లు కష్టపడి ట్రస్ట్ పెట్టానని నాగలక్ష్మి కామెంట్లు చేశారు.

చిరంజీవి గారితో మాట్లాడిన సమయంలో ఆయన సూచనల మేరకు 500 మందికి ఎంబ్రాయిడరీ వర్క్ ( Embroidery work )నేర్పించానని ఆమె చెప్పుకొచ్చారు.ప్రజారాజ్యం పార్టీ కోసం మహిళలను నేను తీసుకెళ్లానని నాగలక్ష్మి అన్నారు.చిరంజీవి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా నేను వెళ్లానని ఆమె చెప్పుకొచ్చారు.చచ్చేలోపు చిరంజీవిని చూడాలని అనుకుని చూశానని ఆమె తెలిపారు.ఆపరేషన్ కోసం ఇబ్బంది పడుతున్న సమయంలో చిరంజీవి నుంచి సాయం అందిందని నాగలక్ష్మి అన్నారు.

అభిమానిపై ఈ స్థాయిలో ప్రేమను చూపించడం చిరంజీవికే సాధ్యమని ఆమె తెలిపారు.చిరంజీవి ప్రాణం అయితే పవన్ నా బాధ్యత అని నాగలక్ష్మి తెలిపారు.నాకు ఆపరేషన్ అయిన తర్వాత చిరంజీవి వీడియో కాల్ లో మాట్లాడారని ఆమె చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం నాకు మందులు కొనడానికి కూడా డబ్బులు లేవని ఆమె తెలిపారు.నేను చనిపోతే చిరంజీవి రావాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు.చిరంజీవి ఫ్యాన్ వింత కోరిక విని నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Video : Chiranjeevi Fan Rajanala Nagalakshmi Comments Goes Viral In Social Media #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube