అన్నయ్య ..ఎఫెక్ట్ తమ్ముడికి తగలనుందా..  

ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో భవిష్యత్తులో క్రియాశీలక పాత్ర పోషించేది ఎవరు అంటే చటుక్కున చెప్పే పేరు పవన్ కళ్యాణ్..గత ఎన్నికల్లో పార్టీ పేరుతో కాకుండా కేవలం తన స్టార్ స్టేటస్ తో టీడీపీ ని ఒడ్డున పడేసిన వ్యక్తి పవన కళ్యాణ్ మాత్రమే అయితే ఈ సారి ఏకంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ కి ఇంకెంత క్రేజ్ ఉంటుంది చెప్పండి ఈ సారి ఏకంగా కాపుల ఓట్లని జనసేన వైపు మలుచుకోవడం మాత్రమే కాకుండా ప్రధాన ఓటు బ్యాంక్ అయిన బీసీలపై దృష్టి పెట్టాడు అయితే..కాపులు ఈ సారి పవన్ కి బ్రహ్మరధం పడతారు అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని అంటున్నారు పరిశీలకులు..

Chiranjeevi Effect On Pawan Kalyan Janasena Votes-

Chiranjeevi Effect On Pawan Kalyan Janasena Votes

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాపు సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌లో చీల‌క తప్పదని నొక్కి మరీ చెప్తున్నారు..క్షేత్ర‌స్ధాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే అంద‌రూ అదే అనుమానాలు వ్య‌క్తపరుస్తున్నారు.. కొన్ని జిల్లాల్లోని కాపు సామాజిక‌వ‌ర్గం ఓట్లలో మెజారిటీ ఓట్లు జ‌న‌సేన అభ్య‌ర్ధుల‌కే ప‌డ‌తాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే, గ్రౌండ్ లో జ‌రుగుతున్నది చూస్తుంటే..ఇప్పుడు జనసేన లో గుబులు పుట్టిస్తోంది..అయితే ఈ అనుమానాలు ఎందు రేగాయి అంటే.. గ‌డ‌చిన నెల రోజులుగా తూర్పు గోదావ‌రి జిల్లాలో వైసిపి అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రె్డ్డి పాద‌యాత్ర చేస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే…అయితే గ‌డిచేకొద్దీ, నియోజ‌క‌వ‌ర్గాలు మారేకొద్దీ జ‌గ‌న్ యాత్ర‌కు జ‌నాల ఆధ‌ర‌ణ పెరుగుతూనే వస్తుంది తప్ప తరగడం లేదు..

అయితే ఈ సమయంలో ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి.. కాపులని బీసీలుగా గుర్తించింది చంద్రబాబు అంటూ ఊదర గొట్టారు అందరూ.టీడీపీ చెప్పే లెక్కల ప్రకారం కాపులు బాబు కే ఓటు వేస్తారు వేయాలి అయితే..

అదే స‌మ‌యంలో ప‌వ‌న్ కూడా ప్ర‌ధానంగా కాపు సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌ను దృష్టిలో పెట్టుకునే రాజ‌కీయం చేస్తున్నారు. కాబ‌ట్టి ఇత‌ర పార్టీల త‌రపున కాపులు పోటీ చేసినా కాపుల ఓట్ల‌లో అధిక‌భాగం జ‌న‌సేన అభ్య‌ర్ధుల‌కే ప‌డ‌తాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది..మరి ఈ క్రమంలో జగన్ వైపు కాపులు తొంగి కూడా చూడకూడదు కానీ..

Chiranjeevi Effect On Pawan Kalyan Janasena Votes-

జగన్ ప్రారంభించిన పాద‌యాత్ర‌కు కాపు సామాజిక‌వ‌ర్గం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న విష‌యం అంద‌రూ తెలిసిందే ఇది ఎలా సాధ్యం అయ్యింది అంటే..జ‌న‌సేన అభ్య‌ర్ధులు పోటీలో ఉన్నంత మాత్రాన కాపులంద‌రూ ప‌వ‌న్ పార్టీకే ప‌ట్టం గ‌డ‌తార‌నే ప్ర‌చారంలో వాస్తవం లేద‌ని ఎందుకంటే ప్ర‌జారాజ్యంపార్టీ అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకునే కాపులు కాస్తంత జాగ్రత్త పడుతున్నారని సులువుగా అర్థం అవుతోంది..వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం వలన కాపు ఓట్లలో చీలిక తప్పదని తెలుస్తోంది.. అప్పట్లో కాపుల్లో మెజారిటీ ఓట్లు పిఆర్పీకే ప‌డినా అభ్య‌ర్ధులు గెల‌వ‌లేదు. పైగా పార్టీ అధ్య‌క్షుడు చిరంజీవే ఓడిపోయిన విష‌యం ఎవరూ మరచిపోని విషయమే..

అయితే ఈ లాజిక్కులు అన్నీ కాపు సామాజిక వర్గ నేతలే చెప్పడం గమనార్హం అంటున్నారు విశ్లేషకులు..

అందుక‌నే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాపు సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌లో చీలిక త‌ప్ప‌ద‌ని అది తధ్యం అంటున్నారు..