ఆచార్యలో రామ్ చరణ్ పాత్ర ఆయన చేస్తున్నాడా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Chiranjeevi Doing Ram Charan Role In Acharya, Chiranjeevi, Acharya, Ram Charan,-TeluguStop.com

కాగా ఈ సినిమాలో చిరు సరికొత్త అవతారంలో మనకు కనిపిస్తాడని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో చరణ్ నటించాలంటే ముందుగా ఆయన ఆర్ఆర్ఆర్ నుండి ఫ్రీ కావాల్సి ఉంది.కానీ ఇంకా ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ ముగియకపోవడం, ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా పరిస్థితులు తారుమారు కావడంతో చరణ్ ఆచార్య చిత్రంలో కేమియో పాత్రలో నటిస్తాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న చరణ్, ఆచార్య సినిమాలో నటించబోడని తెలుస్తోంది.

దీంతో ఆచార్యలోని చరణ్ పాత్రను కూడా చిరు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కావడంతో ఈ పాత్రను చిరు చేసినా బాగానే ఉంటుందని చిత్ర వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.దీంతో చరణ్ పాత్ర నిడివి 30 నిమిషాలను చిరు కోసం 15 నిమిషాలకు మారుస్తున్నారట చిత్ర యూనిట్.

ఏదేమైనా చరణ్ పాత్రను కూడా చిరు చేస్తుండటంతో ఆయన చేయబోయే ఈ కేమియో పాత్ర ఎలా ఉంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమాలో అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube