ఆ రెండు సినిమాలకు రెమ్యునరేషన్ తీసుకోని చిరంజీవి.. ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుసగా సినిమాల్లో నటించి చిరంజీవి రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం చిరంజీవి టాలీవుడ్ యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతో సమానంగా 30 కోట్ల రూపాయల నుంచి 35 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు.

 Megastar Chiranjeevi Does Not Take Remuneration For Tammareddy Bharadwaj Movies-TeluguStop.com

తమ్మారెడ్డి భరద్వాజ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోతల రాయుడు సినిమాను 100 రూపాయలతో మొదలుపెట్టానని చెప్పారు.

చిరంజీవి గారు ఇండస్ట్రీకి కొత్త కావడంతో డబ్బులు కూడా ఇవ్వలేదని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

మలయాళం సినిమా రైట్స్ కొని ఆ సినిమా చేశామని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.ఫైనాన్స్ తీసుకుని ఆ సినిమాను తీశానని సినిమా రిలీజైన చాలా రోజుల తర్వాత చిరంజీవికి రెమ్యునరేషన్ ఇచ్చానని రిలీజ్ కు ముందు ఇవ్వలేదు కాబట్టి రెమ్యునరేషన్ ఇవ్వనట్టే అని అనుకోవాలని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.

Telugu Acharya, Chiranjeevi, Kothala Rayudu, Mogudu Kavali, Tamma Bharadwaj-Movi

గతంలో ఫైనాన్స్ మీదనే ఎక్కువగా సినిమాలు చేశామని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.ఆ తరువాత చిరంజీవి, గాయత్రి కాంబినేషన్ లో మొగుడు కావాలి సినిమా చేశామని మొదట లావుగా ఉన్న గాయత్రిని చూసి షాకైనా సినిమా సూపర్ హిట్ అయిందని తమ్మారెడ్డి తెలిపారు.రెండో సినిమాకు ఇల్లు కొనుక్కుంటున్నానని చిరంజీవి చెప్పగా ఆ సినిమాకు డబ్బులు ఇచ్చామని చిరంజీవి గురించి తమ్మారెడ్డి వెల్లడించారు.

Telugu Acharya, Chiranjeevi, Kothala Rayudu, Mogudu Kavali, Tamma Bharadwaj-Movi

సమయానికి డబ్బులు ఇవ్వకపోయినా తరువాత డబ్బులు ఇచ్చేశానని తమ్మారెడ్డి వెల్లడించారు.ఆ తరువాత తమ కాంబినేషన్ లో సినిమా రాలేదని తమ్మారెడ్డి భరద్వాజ్ వెల్లడించారు.అలా కెరీర్ తొలినాళ్లలో పారితోషికం కంటే నటుడిగా గుర్తింపును సంపాదించుకోవడానికే ప్రాధాన్యతనిచ్చిన చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగారు.

ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు సాధించి చిరంజీవి తన కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకున్నారు.ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube