కళ్యాణ్ బాబాయ్ వల్లే మేము గొడవ పడేవాళ్ళం...అది మా బాబాయ్ కి ఫన్ - చిరంజీవి కూతురు కామెంట్స్.!  

ఆగ‌స్టు 22న చిరంజీవి పుట్టినరోజు.. ఇది టాలీవుడ్ లోని మెగా అభిమానులకు పండుగ రోజు. ఇప్పటికే తన 150వ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి తనలో జోష్ ఏమాత్రం తగ్గలేదని సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల ఇంటర్వ్యూలో సుస్మిత, శ్రీజలు మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు.

‘‘నేను, చరణ్‌, శ్రీజ… మా ముగ్గురిలో శ్రీజ చాలా గుడ్‌ గాళ్‌. అసలు అల్లరి చేసేది కాదు. సైలెంట్‌గా ఓ పక్కన కూర్చునేది. చరణ్‌, నేను కొంచెం కొట్టుకునేవాళ్లం. కల్యాణ్‌ బాబాయ్‌ మమ్మల్ని ఎంకరేజ్‌ చేసేవారు. ఏదో ఒకటి చెప్పి మా ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టేవారు. మాతో కలిసి అల్లరి చేసేవారు. సగం గొడవలు ఆయన వల్లే జరిగేవి. ఇంట్లో ఆయనకు మా గొడవలు ఫన్‌ అన్నమాట! శ్రీజ అయితే చాలా సైలెంట్‌. మా ముగ్గురిలో తనే మోస్ట్‌ క్వాలిఫైడ్‌. బాగా చదువుకుంది’’ అని సుస్మిత తెలిపింది.

Chiranjeevi Daughters Comments On Pawan Kalyan-

Chiranjeevi Daughters Comments On Pawan Kalyan

‘‘అక్క, అన్నయ్య గొడవలు పడుతుంటే… నాకు ఏ సంబంధం లేనట్టు కూర్చునేదాన్ని. ఎవరికీ సపోర్ట్‌ చేసేదాన్ని కాదు. అందులోనూ ఇంట్లో నేనే చిన్నపిల్లను కదా! అందరూ నన్ను ముద్దు చేసేవారు. నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ గ్రాడ్యుయేషన్‌ చేశాక… లండన్‌ వెళ్లి మాస్టర్స్‌ చేశా. ఒక టైమ్‌లో స్పోర్ట్స్‌ ఎక్కువ ఆడేదాన్ని, బాడ్మింటన్‌ నేషనల్‌ లెవల్స్‌కి వెళ్లా’’ అని శ్రీజ తెలిపింది.