ఆ కామెంట్ల వల్ల రెండు నెలలు బాధ పడ్డ చిరంజీవి!  

chiranjeevi cried two months for an issues says posani krishanamurali, Chiranjeevi, Shanker Dada Jindhabadh, Prajarajyam Party, Posani Krishna Murali, TDP, Chandrababu Naidu, TDP Womens Workers, Chiranjeevi Daughte Srija Love Affair - Telugu Chandrababu Naidu, Chiranjeevi, Chiranjeevi Daughte Srija Love Affair, Posani Krishna Murali, Prajarajyam Party, Shanker Dada Jindhabadh, Tdp, Tdp Womens Workers

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దాదాపు మూడు సంవత్సరాల పాటు నంబర్ వన్ 1 స్థానంలో కొనసాగిన సంగతి తెలిసిందే.చిరంజీవి 149వ సినిమా శంకర్ దాదా జిందాబాద్ విడుదలైన తరువాత ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

TeluguStop.com - Chiranjeevi Cried Two Months For An Issues Says Posani Krishanamurali

ప్రజారాజ్యం పేరుతో పార్టీని స్థాపించారు.సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోను రూపొందించారు.

అయితే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో చిరంజీవిపై టీడీపీ మహిళా నేతలు వ్యక్తిగత విమర్శలు చేశారని.ఆ కామెంట్ల వల్ల చిరంజీవి రెండు నెలలు బాధ పడ్డారని పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు.

TeluguStop.com - ఆ కామెంట్ల వల్ల రెండు నెలలు బాధ పడ్డ చిరంజీవి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

చిరంజీవికి సన్నిహితంగా మెలిగే వ్యక్తుల్లో ఒకరైన పోసాని ఆ కామెంట్ల వల్లే తనకు చంద్రబాబుపై విరక్తి పుట్టిందని తెలిపారు.చిరంజీవి తన నిజాయితీని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడని వెల్లడించారు.

అయితే చిరంజీవి అవకాశం ఇచ్చినా తాను సద్వినియోగపరచుకోలేకపోయానని.ఎన్నికల్లో తాను గెలలేదని అన్నారు.

ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో చిరంజీవిని ఎగతాళి చేసేలా చంద్రబాబు మాట్లాడేవారని.మహిళా నేతలతో చిరంజీవిపై వ్యక్తిగత విమర్శలు చేయించారని.

టీడీపీ మ‌హిళానేత‌లు చిరంజీవి కూతుళ్లలో ఒక కూతురి పెళ్లి గురించి కామెంట్లు చేశారని.ఆ కామెంట్లు చిరంజీవిని చాలా బాధ పెట్టాయని అన్నారు.

సొంత కూతురిని కంట్రోల్ చేయలేని చిరంజీవి రాష్ట్రాన్ని ఏం కంట్రోల్ చేస్తాడని మహిళా నేతలు చేసిన కామెంట్ల వల్ల చిరంజీవి రెండు నెలలు పడిన బాధను తాను కళ్లారా చూశానని చెప్పుకొచ్చారు.టీడీపీ మహిళా నేతలు చిరంజీవిపై బురద జల్లే ప్రయత్నం చేసినా చంద్రబాబు వారిని వారించలేదని.

ఈ పరిణామాలను చూసి తనకు చంద్రబాబుపై బాధ, కోపం కలిగాయని పోసాని కృష్ణమురళి తెలిపారు.చంద్రబాబు కనీసం మహిళా నేతలతో క్షమాపణలు కూడా చెప్పించలేదని పోసాని పేర్కొన్నారు.

#PosaniKrishna #ShankerDada #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chiranjeevi Cried Two Months For An Issues Says Posani Krishanamurali Related Telugu News,Photos/Pics,Images..