తెలంగాణ గవర్నర్ తో చిరు దంపతుల భేటీ ? కారణాలు చాలానే ఉన్నాయిగా ?  

Chiranjeevi Couple Met Telangana Governor - Telugu Birthday Wishes, Bjp, Chiranjeevi, Chiranjeevi With Surekha, Janasena, Tamilisai Soundararajan, Telangana Governor

గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి యాక్టివ్ గా కనిపిస్తున్నారు.అన్ని విషయాల్లోనూ తనదైన శైలిలో ముద్ర వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

 Chiranjeevi Couple Met Telangana Governor

సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉంటూనే, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరితోనూ ఎక్కువ సాన్నిహిత్యం పెంచుకునే విధంగా చిరు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఆయన బీజేపీ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్న తరుణంలో ఈ విధంగా వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

కానీ తాను ఏ రాజకీయ పార్టీలో చేరేది లేదని, తమ్ముడు జనసేన పార్టీ ఉండగా నేను ఇంకా రాజకీయాల్లో రావడం అనవసరం అంటూ చిరు గతంలో వ్యాఖానించినా, ఇప్పుడు మాత్రం ఆయన వ్యవహార శైలిలో మార్పు రావడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

తెలంగాణ గవర్నర్ తో చిరు దంపతుల భేటీ కారణాలు చాలానే ఉన్నాయిగా -Political-Telugu Tollywood Photo Image

తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసే ఉద్దేశంతో చిరు సతీ సమేతంగా గవర్నర్ నివాసానికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సోషల్ మీడియా ద్వారా ఆమెకు ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలిపారు.చిరు అలా చెప్పే అవకాశం ఉన్నా , పనిగట్టుకుని ఆమె నివాసానికి వెళ్లి భేటీ అవ్వడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.

కొద్దిరోజులుగా సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ, చిరు వర్గాల మధ్య వివాదం రేగిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారం ఇలా ఉండగా చిరు గవర్నర్ తో భేటీ అవ్వడం కేంద్ర బీజేపీ పెద్దలతో సాన్నిహిత్యం పెంచుకునేందుకు అనే వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం చిరంజీవి తమ్ముడు పవన్ జనసేన పార్టీని పెట్టి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.ఒకవైపు చిరంజీవి టిఆర్ఎస్ ప్రభుత్వంతోనూ, అటు ఏపీలో వైసీపీ ప్రభుత్వంతోనూ సన్నిహితంగా ఉంటున్నారని, ఇప్పుడు బిజెపి తో కూడా అదే స్థాయిలో సాన్నిహిత్యం కోరుకుంటూ ఉండడం, ఒకవేళ ఆయన బిజెపిలో చేరకపోయినా ఆ పార్టీ పెద్దలతో సన్నిహితంగా మెలగడం ద్వారా చిరంజీవి రాజకీయంగా ఏదో ఆశిస్తున్నారనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.చిరు మాత్రం ఈ వ్యవహారాలు వేటినీ పట్టించుకోకుండా, తనదైన శైలిలో ముందుకు వెళుతుండటం కూడా ప్రస్తుతం అనుమానాలు రేకెత్తడానికి కారణం అవుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test