కరోనా విపత్తు సమయంలో తెలుగు సినిమా కార్మికులకు సాయం చేసేందుకు మెగాస్టార్ తో పాటు పలువురు ప్రముఖులు ముందుకు వచ్చారు.ఇప్పటికే రెండు దఫాలుగా సినీ కార్మికులకు నిత్యావసరాలను సీసీసీ ద్వారా అందించారు.
మెగాస్టార్ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ సీసీసీ ద్వారా మూడవ దఫా సాయం చేసేందుకు సిద్దం అయ్యారు.ఆ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తెలియజేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సినీ కార్మికులు ఆందోళన పడవద్దని సాయంకు తాము సిద్దంగా ఉన్నట్లుగా ఆయన చెప్పాడు.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దాదాపు పది వేల మంది సినీ కార్మికులకు గాను ఈసారి సాయం చేయబోతున్నట్లుగా చిరంజీవి పేర్కొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ పరిస్థితులు శాశ్వతంగా ఉండబోవు.త్వరలోనే ఈ సంక్షోభం నుండి బయట పడుతామన్నారు.రెండు రాష్ట్రాల్లో ఉన్న కార్మికుల సహాయార్థం పంపిణీ చేయబోతున్న ఈ నిత్యావసరాలు వారి వారి అవసరాలను తీరుస్తాయన్నారు.
కరోనా మనకు రాదు మనకేం కాదు అనే నిర్లక్ష్య ధోరణితో ఏ ఒక్కరు ఉండకూడదు.ప్రతి ఒక్కరు కూడా కరోనాతో జాగ్రత్తగా ఉండాల్సిందే అంటూ చిరంజీవి హెచ్చరించారు.అందరు జాగ్రత్తగా ఉండండి.
జాగ్రత్తగా వినాయక చవితి జరుపుకోండి అంటూ చిరంజీవి వీడియోను షేర్ చేశారు.చిరంజీవి త్వరలోనే ఆచార్య చిత్రం షూటింగ్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.