సూపర్ మచ్చి కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్...  

Chiranjeevi Concentrate On His Son In Law Super Machi Film - Telugu Chiranjeevi Latest Movie News, Chiranjeevi News, Chiranjeevi Super Machhi News, Kalyan Dev Movie News, Megastar Chiranjeevi, Tollywood

టాలీవుడ్ లో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తున్నటువంటి చిత్రం సూపర్ మచ్చి.ఈ చిత్రానికి దర్శకుడు పులివాసు దర్శకత్వం వహిస్తుండగా సినీ నిర్మాత రిజ్వాన్ నిర్మిస్తున్నారు.

Chiranjeevi Concentrate On His Son In Law Super Machi Film - Telugu Latest Movie News Machhi Kalyan Dev Megastar Tollywood

అయితే ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఇప్పటికే పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.

అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రానికి సంబంధించినటువంటి పలు కీలక సన్నివేశాలను పరిశీలించినట్లు సమాచారం.అయితే ఈ సన్నివేశాలు చిరంజీవికి పెద్దగా నచ్చకపోవడంతో దర్శకుడు పులి వాసుకి కథనం టేకింగ్ విషయంలో మరింత జాగ్రత్తలు వహించాలని సూచించినట్లు తెలుస్తోంది.

అంతేగాక టాలీవుడ్లో మంచి పేరున్న డైలాగ్ రైటర్స్ అయినటువంటి పరుచూరి బ్రదర్స్ ని కూడా ఈ చిత్రం కోసం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.దీంతో పరుచూరి బ్రదర్స్ ఇప్పటికే పలు డైలాగులు సన్నివేశాలకు సంబంధించిన ఎటువంటి మార్పులు చేర్పులు కూడా చేసి కథలో రక్తి కట్టించే సన్నివేశాలను అదనంగా చేర్చినట్లు తెలుస్తోంది.

అయితే గతంలో కళ్యాణ్  దేవ్ నటించినటువంటి విజేత చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.దీంతో తన అల్లుడు హిట్ కోసం  ఈసారి మెగాస్టార్ చిరంజీవి కొంతమేర ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు.అలాగే చిత్రీకరణ విషయాలకు సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మార్పులు చేర్పులపై దర్శకుడితో  చర్చిస్తున్నాడు.అయితే మరి మెగాస్టార్ చిరంజీవి అయినా కళ్యాణ్ దేవ్ తో హిట్ కొట్టిస్తాడో లేదో చూడాలి.

తాజా వార్తలు