42 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి  

Chiranjeevi completed 42 years in Telugu cinema industry, Tollywood, Indian Cinema, Megastar Chiranjeevi, 42 Years, - Telugu @alwaysramcharan, @kchirutweets, 42 Years, Indian Cinema, Megastar Chiranjeevi, Telugu Cinema Industry, Tollywood

టాలీవుడ్ ఇండస్ట్రీ కింగ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆయన జీవితం తెరిచిన పుస్తకం.

TeluguStop.com - Chiranjeevi Completed 42 Years In Telugu Cinema Industry

కమర్షియల్ హీరోగా కోట్లాది అభిమానులని తన నటనతో సొంతం చేసుకున్న చిరంజీవి ఒక అన్నగా, కుటుంబానికి పెద్దగా ఇప్పటికి ఎంతో మందికి ఆదర్శం అని చెప్పాలి.కేవలం నటుడుగానే కాకుండా ఒక వ్యక్తిగా కూడా చిరంజీవి ఎంతో మంది స్ఫూర్తి.

సంకల్పం, కార్యదీక్ష ఉంటే ఎంత గొప్ప స్థానానికి వెళ్ళవచ్చు అనేది అతని ప్రయాణమే ఉదాహరణ.ప్రస్తుతం ఇండస్ట్రీకి కూడా చిరంజీవి ఓ విధంగా పెద్ద దిక్కుగా ఉన్నారు.

TeluguStop.com - 42 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

చిన్న సినిమాలు నిర్మాతలని సైతం ప్రోత్సహిస్తూ వారి సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కి వెళ్తునన్నారు.అలాగే కరోనా కష్టకాలంలో ఇండస్ట్రీలో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కళాకారులు, టెక్నీషియన్స్ కి అండగా నిలబడ్డారు.

1978లో పునాది రాళ్ళు చిత్రంతో సినీ ప్రస్థానాన్ని ఆరంభించిన చిరంజీవి దిగ్విజయంగా 42 సంవత్సరాలను పూర్తి చేశారు.ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని బాస్‌ ఇన్‌ టాలీవుడ్‌ పేరుతో ఓ కామన్‌ డిస్‌ ప్లే పిక్‌తో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు.

జయాపజయాలతో నిమిత్తం లేకుండా భిన్న పాత్రలు, వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు.ఆయన డాన్స్ గ్రేస్ తో హీరోలకె కాకుండా డాన్స్ కెరియర్ ఎంచుకున్న వాళ్ళకి కూడా స్ఫూర్తిగా నిలిచారు.

42 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో మెగాస్టార్ ఏకంగా 150 చిత్రాల్లో నటించారు.ప్రస్తుతం 151వ సినిమా ఆచార్య కొరటాల శివ దర్శకత్వంతో తెరకెక్కుతోంది.దీంతో పాటు వరుసగా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి చిరంజీవి ప్లాన్ చేసుకుంటున్నారు.ఇండస్ట్రీ కింగ్ గా ఉన్న మెగాస్టార్ ఛరిష్మాని ఇకపై టాలీవుడ్ ఏ హీరో కూడా అందుకునే అవకాశం లేదని చెప్పాలి.

ఎందుకంటే ఒకప్పటిల థియేటర్స్ ముందు అభిమాన హీరోలకి కటౌట్స్ కట్టే ఫ్యాన్స్ కూడా ఉండరు కాబట్టి.

#@KChiruTweets #42 Years #TeluguCinema

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chiranjeevi Completed 42 Years In Telugu Cinema Industry Related Telugu News,Photos/Pics,Images..