బలివ్వడానికి మేకను తీసుకెళ్లినట్టు సురేఖతో పెళ్లి.. చిరంజీవి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి సురేఖ జోడీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.చిరంజీవి సురేఖ అన్యోన్యంగా ఉండటంతో పాటు చిరంజీవి కెరీర్ లో ఈ స్థాయిలో సక్సెస్ సాధించడం వెనుక సురేఖ పాత్ర ఎంతో ఉంది.

 Chiranjeevi Comments Viral About Marriage With Surekha Details, Chiranjeevi, Chi-TeluguStop.com

అల్లు రామలింగయ్య పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ అల్లు రామలింగయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అని అన్నారు.మనవూరి పాండవులు సినిమా సమయంలో మేము మొదటిసారి కలిశామని ఆయన చెప్పుకొచ్చారు.

అల్లు రామలింగయ్య గారిని తొలిసారి కలిసిన సమయంలో ఈయన ఇంత సీరియస్ గా ఉన్నారేంటని అనుకున్నానని చిరంజీవి తెలిపారు.ఆరోజు షూటింగ్ పూర్తైన తర్వాత అల్లు రామలింగయ్య గారు బాబూ నీ పేరేంటి? నీ ఊరెక్కడ? అని అడిగి నా వివరాలను తెలుసుకున్నారని చిరంజీవి చెప్పుకొచ్చారు.ఆరోజు నుంచి అల్లు రామలింగయ్య గారి దృష్టి నాపై ఎక్కువగా ఉండేదని చిరంజీవి కామెంట్లు చేశారు.

 Chiranjeevi Comments Viral About Marriage With Surekha Details, Chiranjeevi, Chi-TeluguStop.com

ఆ తర్వాత ఆయనతో పాటు అల్లు అరవింద్, మనవూరి పాండవులు మూవీ ప్రొడ్యూసర్ జయకృష్ణ కూడా కలిశారని నన్ను ఎలాగైనా సురేఖకు ఇచ్చి పెళ్లి చెయ్యడానికి వాళ్లు సిద్ధమయ్యారని చిరంజీవి చెప్పుకొచ్చారు.

నిర్మాత జయకృష్ణ మా నాన్నతో మాట్లాడి నాన్నను ఒప్పించడంతో నాన్న కూడా నాకు పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారని చిరంజీవి కామెంట్లు చేశారు.

బలివ్వడానికి గొర్రెను తీసుకెళ్లినట్టు నన్ను సురేఖతో పెళ్లికి సిద్ధం చేశారని చిరంజీవి కామెంట్లు చేశారు.పెళ్లిచూపుల తర్వాత సురేఖ పెట్టిన కాఫీ తాగి పెళ్లికి ఓకే చెప్పానని చిరంజీవి చెప్పుకొచ్చారు.వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్న సమయంలో మూడే మూడు రోజులు బ్రేక్ తీసుకుని పెళ్లి చేసుకున్నానని ఆయన వెల్లడించారు.

చిరిగిన చొక్కాతో సురేఖ మెడలో తాళి కట్టానని చిరంజీవి పేర్కొన్నారు.చిరంజీవి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Video : Chiranjeevi Comments Viral About Marriage With Surekha Details, Chiranjeevi, Chiranjeevi Surekha, Surekha Konidela, Chiranjeevi Surekha Marriage, Allu Ramalingaiah, Allu Aravind, Producer Jayakrishna #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube