అది కారవ్యానా లేక కాపురాలు చేసే వ్యానా అంటూ మండిపడ్డ  చిరు...

మామూలుగా సినీ పరిశ్రమలో ప్రస్తుత జనరేషన్ లో ప్రతి ఒక్క హీరోయిన్ కారవ్యాన్ ని ఉపయోగిస్తున్నారు.అయితే ఈ కారవ్యాన్ షూటింగుల సమయంలో  బ్రేక్ దొరికినప్పుడు రిలాక్స్ అవ్వడానికి, హీరోయిన్లు బట్టలు మార్చుకోవడానికి, లేదా ఎమర్జెన్సీ మల మూత్ర విసర్జనలకు, హీరో హీరోయిన్లు మేకప్ వేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

 Chiranjeevi Comments On Using Carvan Telugustop-TeluguStop.com

అయితే ప్రస్తుత కాలంలో కొందరు ఈ కారవ్యాన్లను దుర్వినియోగం చేస్తున్నారని మెగాస్టార్ చిరంజీవి మరియు ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ తాను గతంలో శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో నటించినప్పుడు  తనకు ఇచ్చినటువంటి కార్ వ్యాన్ వంటిది తన చిత్రంలో పని చేసినటువంటి కొందరు ఆర్టిస్టులకు కూడా ఇస్తే బాగుండని అభిప్రాయపడ్డానని అన్నారు.

అయితే ఇప్పుడు దాదాపుగా చిత్ర పరిశ్రమలో పని చేసే హీరో హీరోయిన్లకి ఈ కారవ్యాన్లు అందుబాటులో ఉంటున్నాయని కానీ కొందరు ఈ కారవ్యాన్లను దుర్వినియోగం చేసుకుంటున్నారని అన్నారు.

Telugu Chiranjeevi-Movie

ఎలాగంటే మామూలుగా ఏదైనా సన్నివేశం చిత్రీకరించే సమయంలో కొంత బ్రేక్ వస్తే చాలు పోయి ఈ కారవ్యాన్లలో రిలాక్స్ అవుతున్నారని దీనివల్ల పక్కన ఉండే వాళ్ళు కూడా ఇదే అలవాటుగా చేసుకుంటున్నారని అన్నారు.ఇలా చేయడం వల్ల అసిస్టెంట్ డైరెక్టర్లు తమ సినీ జీవితంలో చిత్ర షూటింగ్ సమయంలో సగం కాలాన్ని కారవ్యాన్లో రిలాక్స్ అవుతున్న ఆర్టిస్టులను పిలవడానికె గడుపుతున్నారని ఇలా అయితే కొత్త తరం దర్శకులు ఏం నేర్చుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి ఈ వ్యాఖ్యలతో తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఏకీభవించారు.

చిరంజీవి చెప్పింది అక్షరాలా నిజమని, చిత్రీకరణ సమయంలో హీరో హీరోయిన్లు కష్టపడుతున్న ఆర్టిస్టులతో సరదాగా మెలిగితే పనులు చక్కగా, తరగతిన పూర్తి అవుతాయని చెప్పుకొచ్చారు.అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ సెలబ్రిటీ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో హీరో హీరోయిన్లకు కారవ్యాన్ ఇచ్చే విషయంలో దర్శకనిర్మాతలు కొంతమేర ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube