ఎవరైనా పొగిడితే ఆ రోజు నేలపై పడుకుంటా అంటున్న మెగాస్టార్  

Chiranjeevi Comments On Praising On Events - Telugu Chiranjeevi Comments, Megastar, Praising On Events, Telugu Cinema, Tollywood

టాలీవుడ్ లెజెండ్ మెగాస్టార్ చిరంజీవి నేటి తర్వాత హీరోలలో ఎంత మందికి స్ఫూర్తి.స్వయంకృషితో హీరోగా ఎదిగి ఇప్పుడు టాలీవుడ్ ని ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి పెద్దదిక్కులా మారిపొయారు.

 Chiranjeevi Comments On Praising On Events

చిన్న సినిమాల రిలీజ్ ఈవెంట్స్ కి కూడా వెళ్తూ కొత్త వాళ్ళని ఆశ్వీర్వదిస్తున్నారు.రాజకీయాల కారణంగా తొమ్మిదేళ్ళు సినిమాలకి దూరమైనా మెగాస్టార్ మరల రీఎంట్రీలో తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు.

ఆయన రేంజ్ ని ఎవరూ అందుకోలేరని చూపించారు.మరో వైపు మెగా ఫ్యామిలీ నుంచి తొమ్మిది మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారంటే అదంతా కేవలం మెగాస్టార్ దయవలనే అని చెప్పాలి.

ఎవరైనా పొగిడితే ఆ రోజు నేలపై పడుకుంటా అంటున్న మెగాస్టార్-Movie-Telugu Tollywood Photo Image

ఎంత ఎత్తుకి ఎదిగిన ఒదిగి ఉండటం చిరంజీవి లక్షణం.ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శలు చేసి సహృదయంతో క్షమించడం అతని వ్యక్తిత్వం, ఎవరిని పల్లెత్తు మాట కూడా అన్ని నైజం చిరంజీవిది.

తాజాగా చిరంజీవి ఓ సినిమా ఫంక్షన్ లో అన్న మాటలు ఇప్పుడు అతని మీద మరింత గౌరవం పెంచే విధంగా ఉన్నాయి.ఎవరైనా తనని పోగిడినపుడు ఇంటికి వెళ్లి నేలపై నిద్రపోతా.

ఎందుకంటే ఎలాంటి గర్వం నెత్తి మీదకి రాకూడదని, నాఈ స్థాయి వెనుక కేవలం నా గొప్పతనం మాత్రమే లేదు ఎంతో మంది కళాకారుల, శ్రామికుల కష్టం ఉంది.నేను ఈ రోజు అనుభవిస్తున్న ఈ హోదాకి ఎంతో మంది కారణం అయ్యారు.

సక్సెస్, ఫెయిల్యూర్, విమర్శలు, ప్రశంసలు అన్నింటిని ఒకేలా తీసుకుంటా అని అన్నారు.నిజంగా చిరంజీవి చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ఎంతో మంది కుర్ర హీరోలకి కూడా స్పూర్తిని ఇచ్చే విధంగా ఉన్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chiranjeevi Comments On Praising On Events Related Telugu News,Photos/Pics,Images..

footer-test