ఎంతో మంది యువకులకు స్పూర్తి నింపిన చిరంజీవి సినిమా..

మెగాస్టార్ చిరంజీవి… తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సంచనాలను సృష్టించాడు .పునాది రాళ్ల నుంచి నేటి ఆచార్య దాకా కొనసాగుతున్న ఆయన.

 Chiranjeevi Challenge Movie Unknown Facts , Chiranjeevi , Challenge Movie, Koda-TeluguStop.com

నాలుగు దశాబ్దాల పాటు మకుటం లేని మహరాజుగా తెలుగు సినిమా పరిశ్రమను ఏలుతున్నాడు.ఆరు పదుల వయసు దాటినా.

చిరంజీవి ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నాడు.భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ ఇప్పటికీ తనలో గ్రేస్ తగ్గలేదని నిరూపించుకుంటున్నాడు.

యంగ్ దర్శకులతో కలిసి వరుస సినిమాలు చేస్తున్నాడు.ఈ విషయాలు కాస్త పక్కన పెడితే.చిరంజీవి, కోదండరామిరెడ్డి.వీరిద్దరిది సూపర్ డూపర్ కాంబినేషన్.వీరిద్దరు కలిసి ఏకంగా 25 సినిమాలు చేశారు.చిరంజీవి కోదండరామిరెడ్డి సినిమాలతోనే మెగాస్టార్ గా ఎదిగాడు అని చెప్పుకోవచ్చు.

వీరిద్దరు కలిసి చివరిగా చేసిన సినిమా ముఠామేస్త్రి.వీరిద్దరు కలిసి ఎన్నో సంవత్సరాలు కలిసి పని చేశారు.

చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబోలో వచ్చిన సినిమాల్లో ఛాలెంజ్ సినిమా ఒకటి.ఈ సినిమా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె ఎస్.రామారావు నిర్మించాడు.ఈ చిత్రంలో చిరంజీవి, రావు గోపాల‌రావుతో ఒక ఛాలెంజ్ చేస్తాడు.

ఒక్క రూపాయితో 5 సంవత్సరాలలో 50 లక్షలు సంపాదించి వస్తానని చిరంజీవి శపథం చేస్తాడు.దానికి రావు గోపాలరావు కారు కూతలు వద్దని చిరంజీవికి కౌంటర్ ఇస్తాడు.

ఈ ఛాలెంజ్ లో చిరంజీవి ఎలా గెలిచాడు? అనే విషయాన్ని కోదండరామిరెడ్డి చాలా చక్కగా చూపించాడు.ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

Telugu Chiranjeevi, Kodandrami, Rao Gopala Rao, Tollywood-Telugu Stop Exclusive

ఛాలెంజ్ ఆ సినిమా విడుదల అయ్యాక.కోదండరామిరెడ్డి ఎక్కడకు వెళ్లినా మంచి స్వాగతం ఉండేది.అమెరికాకు వెళ్లినా కూడా చాలా మంది యువకులు తన దగ్గరికి వెళ్లి ఛాలెంజ్ సినిమా తమకు మంచి స్పూర్తి ఇచ్చిందని చెప్పేవారట.ఆ సినిమాను ప్రేరణగా తీసుకుని ఎంతో మంది కష్టపడి ఉన్నత స్థానాలకు చేరుకున్నట్లు వెల్లడించాడు.

ఈ విషయం తనకు ఎంతో గర్వాన్ని ఇస్తుందని కోదండరామిరెడ్డి చాలా వేదికల మీద చెప్పాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube