మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది ఆచార్య మరియు గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మొన్న సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ మూడు సినిమాల ఫలితాన్ని ఆధారంగా తీసుకొని మెగాస్టార్ చిరంజీవి భవిష్యత్ సినిమాలు ఉండబోతున్నట్లు సమాచారం అందుతుంది.ఆచార్య ఫెయిల్ అయిన నేపథ్యంలో ఇక నుండి ప్రయాగాత్మక సినిమాలు అసలు చేయవద్దని నిర్ణయించుకున్నాడు.
అలాగే గాడ్ ఫాదర్ సినిమా విషయం లో కూడా చిరంజీవి కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడు.మొన్న సంక్రాంతి కి విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆ సినిమా లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు తన మాస్ లుక్ అదిరిపోయే విధంగా ఉండడంతో ఇక ముందు అన్ని సినిమాల్లో కూడా అదే ఫార్ములాను ఫాలో అవ్వాలని మెగాస్టార్ చిరంజీవి తన దర్శకులకు సూచించాడట, అందుకే ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన భోళా శంకర్ సినిమా లో పలు సన్నివేశాలను మార్చబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఆ మధ్య మెగా కాంపౌండ్ నుండి వినిపించిన వార్తల సారాంశం ప్రకారం భోళా శంకర్ సినిమా సగానికి పైగా చిత్రీకరణ పూర్తయింది.కానీ తాజా సమాచారం ప్రకారం సినిమా 30% మాత్రమే పూర్తయింది, 70% చిత్రీకరణ జరగాల్సింది అంటున్నారు.మొన్న చిరంజీవి కూడా అదే మాట అన్నాడు.
అంటే కొంత మొత్తం చిత్రీకరణ చేసింది తొలగించినట్లే.అంటే చాలా వరకు మళ్లీ షూటింగ్ చేయాల్సి ఉందన్నమాట.
స్క్రిప్టులో భారీ మార్పులు చేయడం వల్ల బడ్జెట్ కూడా పెరిగే అవకాశం ఉంది.మెగాస్టార్ చిరంజీవి సినిమా కనుక బడ్జెట్ ఎంత పెరిగినా కూడా నిర్మాతలకు పెద్దగా ఇబ్బంది ఉండదు.
ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఈజీగా 100 కోట్లకు పైగా చేస్తుంది.కనుక మెగాస్టార్ తో చిరంజీవి తో సినిమా అంటే రిస్క్ ఉండదు.
భారీ మార్పులు చేసి మళ్లీ రీ షూట్ చేసినా నష్టమైతే ఉండక పోవచ్చు.అయితే భోళా శంకర్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.