టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ చార్మింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు అంటే ఎంత హంగామా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.కొన్ని రోజుల నుండి ఈయన పుట్టిన రోజు కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు.
మరి వారి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.దీంతో ఫ్యాన్స్ తమ హంగామా స్టార్ట్ చేసారు.
మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ విషెష్ చెబుతూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.వీరి హంగామా కు సోషల్ మీడియా సైతం షేక్ అవుతుంది.
సూపర్ స్టార్ కు ఎంత మంది అభిమానులు ఉన్నారో కూడా చెప్పడం కష్టమే.ఈయన ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఈ స్టేజ్ కు చేరుకున్నారు.
ఇక మహేష్ పుట్టిన రోజు నాడు ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రముఖులు సైతం ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెష్ చెబుతున్నారు.ఈ క్రమంలోనే మన టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా హృదయపూర్వక పుట్టిన రోజు విషెష్ అందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు.
ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది.
చిరు మహేష్ బాబుకి విషెష్ చెబుతూ.”ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు.ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహేష్ బాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అంటూ చిరు చేసిన ఈ అద్భుతమైన పోస్ట్ అందరిని ఆకట్టు కుంటుంది.
అలాగే చిరు షేర్ చేసిన ఫోటో చుసిన మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.