నిర్లక్ష్యంగా మాట్లాడిన నాగబాబు.. చేయి చేసుకున్న చిరంజీవి.. ఆతర్వాత ఏం జరిగిందంటే?

కుటుంబం అన్నాక గొడవలు కామన్.ఇక అ‌క్కాచెల్లెల్లు, అన్నాదమ్ములు అన్నాక చిన్న చిన్న మనస్పర్థలూ రావడం సర్వసాధారణం.

 Chiranjeevi Beats Nagababu In Their Childhood Because Of This Reason-TeluguStop.com

అలాగే వాళ్లు ఎంత అన్యోన్యంగా ఉన్నా… ఏదో ఒక సందర్భంలో.ఏదో ఒక విషయంలో గొడవ పడటం మనం చూస్తూనే ఉన్నాం.

ముఖ్యంగా ఇలాంటివి చిన్న వయసులోనే ఎక్కువగా జరుగుతుంటాయి.

 Chiranjeevi Beats Nagababu In Their Childhood Because Of This Reason-నిర్లక్ష్యంగా మాట్లాడిన నాగబాబు.. చేయి చేసుకున్న చిరంజీవి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక సినిమా ఫీల్డ్ లో ఉన్న వారి గురించి ఏది జరిగినా.

లేదా ఎది తెలిసినా… అది ఇప్పటి కాలంలో ట్రెండింగ్ గా సాగుతోంది.ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చాలా మంది అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు అన్నారు.

అంతా బాగున్నంత వరకు ఓకె కానీ వాళ్ళ మధ్య చిన్న గొడవ వచ్చినా ఈరోజుల్లో ముందు సోషల్ మీడియానే పెద్దదిగా చేసి చూపిస్తుంది.అందులో ఎంత నిజం అన్నది వాళ్లే నోరు విప్పే దాకా ఎవరికీ తెలియదు.

ఇక వివరాల్లోకి వెళితే… తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ఆదరణ పొందిన మరియు వెంటనే గుర్తుకు వచ్చే ఫ్యామిలీ మెగాస్టార్ ఫ్యామిలీ.ఆ ముగ్గురి మధ్య ఎన్ని మనస్పర్ధలు వచ్చినా అది కొంతకాలమే.

ఒకానొక సందర్భంలో పవన్ కల్యాణ్ కి, చిరంజీవికి పడట్లేదనే వార్తలు కూడా వచ్చాయి.అలాంటి వార్తలు ఎన్ని ప్రచారం ఐనా తామంతా ఒక్కటే అని వారు ఎప్పటికీ నిరూపిస్తూనే అన్నారు ఆ మెగా అన్నదమ్ములు.

Telugu Chiru Beats Nagababu, Chiru Nagababu Incident, Mega Brothers, Mega Family, Megastar Chiranjeevi, Nagababu, Nagababu Seventh Class, Pawan Kalyan, Tollywood-Movie

మెగాస్టార్ చిరంజీవి, నాగబాబుల మధ్య కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుందని తెలుస్తోంది.ఓ సందర్భంలో చిరంజీవి తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు.ఓసారి తమ్ముడు నాగబాబు మీద చాలా కోపం వచ్చిందని, అప్పుడు తనను తాను కంట్రోల్ చేసుకోలేక కొట్టినట్లు వెల్లడించారు.

చిరంజీవి ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో నాగబాబు 7వ తరగతి చదువుతున్నారట.

పెద్దోడు కాబట్టి ఆ సమయంలో ఇంట్లో అమ్మ ఏ పని చెప్పినా చిరంజీవి చూసుకునేవారట.ఒకరోజు లాండ్రీ నుంచి బట్టలు తీసుకురావడంతో పాటు, మరో పని ఒకేసారి చేయాల్సి రావడంతో లాండ్రీ నుంచి బట్టలు తీసుకొచ్చే పని తమ్ముడు నాగబాబుకు అప్పగించి వెళ్లారట.

అయితే ఈ విషయంలో నాగబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనకు చాలా కోపం వచ్చిందని తెలిపారు.

Telugu Chiru Beats Nagababu, Chiru Nagababu Incident, Mega Brothers, Mega Family, Megastar Chiranjeevi, Nagababu, Nagababu Seventh Class, Pawan Kalyan, Tollywood-Movie

‘నేను బయటకు వెళ్లొచ్చే సరికి లాండ్రీకి వెళ్లి బట్టలు తీసుకురా’ అని చెప్పి వెళ్లాను.కానీ తిరిగి వచ్చేసరికి .నాగబాబు ఆ పని చేయకుండా నిద్ర పోయాను అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు.దీంతో నాకు చాలా కోపం వచ్చి తమ్ముడిని కొట్టాను.దాంతో… అమ్మ నాపై కోప్పడింది.అయితే నాన్న వచ్చి మళ్లీ నాకు సపోర్ట్ ఇచ్చి తమ్ముడి నిర్లక్ష్యాన్ని మందలించారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

తమ్ముడిపై చేసుకున్న ఈ సంఘటన ఆయన మైండ్‌లో అలానే ముద్రపడిపోయిందని చిరంజీవి అన్నారు.

తాను ఎంతగానో ప్రేమించే తమ్ముడిపై క్షణికావేశంలో చేయిచేకున్న సంఘటన తనను చాలా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఆ తర్వాత నుంచి తమ్ముళ్లను మరింత ప్రేమగా చూసుకోవడం మొదలు పెట్టానని చిరంజీవి వివరించారు.

#Family #Nagababu #Chiru Nagababu #Chiranjeevi #NagababuSeventh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు