బాలయ్యను చిరు ఫాలో కావాలంటోన్న మెగా ఫ్యాన్స్  

Chiranjeevi Fans Ask To Follow Balakrishna, Chiranjeevi, Balakrishna, Narthanasala, Tollywood News, Abu Bhagdad Gajadonga, Sharath Babu, - Telugu #narthanasala, Abu Bhagdad Gajadonga, Balakrishna, Chiranjeevi, Chiranjeevi Fans Ask To Follow Balakrishna, Sharath Babu, Tollywood News

నందమూరి బాలకృష్ణ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడు.గతంలో తనకు ఎంతో ఇష్టమైన ‘నర్తనశాల’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నించిన బాలయ్య, కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను మధ్యలోనే ఆపేసిన సంగతి తెలిసిందే.

TeluguStop.com - Chiranjeevi Balakrishna Narthanasala

అయితే ఇప్పుడు ఆ సినిమాను దసరా కానుకగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు బాలయ్య ప్రకటించడంతో ‘నర్తనశాల’పై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అయ్యింది.మధ్యలో ఆగిపోయిన సినిమాను కూడా ఇలా రిలీజ్ చేయొచ్చని బాలయ్య నిరూపించడం, ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ఇక బాలయ్య నడిచే దారిలోనే తమ అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా నడవాలని మెగా అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు.ఆగిపోయిన సినిమాను సైతం రిలీజ్ చేసి ఔరా అనిపించిన బాలయ్యలాగే, చిరు కూడా తన ప్రెస్టిజీయస్ మూవీ ‘అబు – బగ్ధాద్ గజదొంగ’ను రిలీజ్ చేయాలని వారు కోరుతున్నారు.

TeluguStop.com - బాలయ్యను చిరు ఫాలో కావాలంటోన్న మెగా ఫ్యాన్స్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

గతంలో చిరంజీవి హీరోగా ఈ జానపద చిత్రాన్ని బాషా చిత్ర దర్శకుడు సురేష్ కృష్ణ షూటింగ్ మొదలుపెట్టాడు.అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది.

దీంతో ఇప్పుడు ఈ సినిమా పూర్తయినంత వరకు రిలీజ్ చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు.

కొంతమేర షూటింగ్ జరుపుకున్న సినిమాలను ఎడిట్ చేసి రిలీజ్ చేస్తే వాటికి మంచి క్రేజ్ లభిస్తుందని బాలయ్య నిరూపించాడు.

నర్తనశాల చిత్రంలో బాలయ్య అర్జునుడి పాత్రలో నటిస్తుండగా సౌందర్య ద్రౌపది పాత్రలో నటిస్తుంది.శరత్‌బాబు ధర్మరాజుగా, శ్రీహరి భీముడి పాత్రల్లో నటిస్తు్న్నారు.

హెలికాప్టర్ ప్రమాదం సౌందర్య మరణంతో ఈ సినిమా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.మరి ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఈ ‘నర్తనశాల’ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

ఈ సినిమా రిజల్ట్‌తో చిరు ‘అబు’ చిత్రాన్ని రిలీజ్ చేస్తారేమో చూడాలి.

#AbuBhagdad ##Narthanasala #ChiranjeeviFans #Sharath Babu #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chiranjeevi Balakrishna Narthanasala Related Telugu News,Photos/Pics,Images..