సక్సెస్ జోష్ లో బాలయ్య, వెంకీ, నాగ్.. చిరంజీవికి మాత్రం నిరాశే అంటూ?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన చిరంజీవి ప్రస్తుతం 30 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.ఇతర సీనియర్ స్టార్ హీరోలెవరూ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు.

 Chiranjeevi Balakrishna Nagarjuna Venkatesh Cine Career Details, Balakrishna , C-TeluguStop.com

మరోవైపు రీఎంట్రీలో చిరంజీవి నటించిన పలు సినిమాలు 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేయడం గమనార్హం.

రీఎంట్రీలో సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న ఆచార్య సినిమాతో విమర్శలు మూటగట్టుకున్నారు.

అయితే ఇదే సమయంలో బాలయ్య నటించిన అఖండ, వెంకటేష్ నటించిన ఎఫ్3, నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలు సక్సెస్ సాధించాయి.ఇతర హీరోలు వరుస సక్సెస్ లతో కెరీర్ ను కొనసాగిస్తుండగా చిరంజీవి మాత్రం ఫ్లాప్ లో ఉండటం ఆయన అభిమానులను ఒకింత బాధ పెడుతోంది.

చిరంజీవి వేగంగా సినిమాలు చేస్తుండగా తర్వాత ప్రాజెక్ట్ లతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి నెలకొంది.

Telugu Acharya, Akhanda, Balakrishna, Bangarraju, Bhola Shankar, Chiranjeevi, Go

చిరంజీవి తనపై వ్యక్తమైన విమర్శలకు గాడ్ ఫాదర్ ద్వారా గట్టిగా సమాధానం ఇస్తారేమో చూడాల్సి ఉంది.మరోవైపు భోళా శంకర్ సినిమాలో నితిన్ కీలక పాత్రలో నటిస్తున్నాడంటూ వైరల్ అవుతున్న వార్తలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతుండటం గమనార్హం.

మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

Telugu Acharya, Akhanda, Balakrishna, Bangarraju, Bhola Shankar, Chiranjeevi, Go

అయితే టాలెంట్ ఉన్న దర్శకుడు కావడం, బ్యాగ్రౌండ్ ఉండటం వల్ల ఈ దర్శకుడికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.భోళా శంకర్ హిట్టైతే మాత్రమే మెహర్ రమేష్ కు కొత్త సినిమా ఆఫర్లు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.వేగంగా సినిమాలు చేస్తున్న చిరంజీవి బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube