పోలీస్ స్టోరీ లతో పోటీ పడ్డ నలుగురు సీనియర్ హీరోలు.. కానీ గెలిచింది ఎవరో తెలుసా?

సాధారణంగా ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలు తీయాలని దర్శక నిర్మాతలు అనుకుంటూ ఉంటారు.ఇలా ఎన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు వచ్చినప్పటికీ అటు పోలీస్ స్టోరీ నేపథ్యంలో వచ్చే సినిమాలు మాత్రం ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

 Chiranjeevi Balakrishna Box Office Fight ,chiranjeevi,  Balakrishna , Nagarjuna-TeluguStop.com

అందుకే అలాంటి సినిమాల్లో నటించేందుకు స్టార్ హీరోలు అందరూ తెగ ఇష్టపడుతూ ఉంటారు.కాగా ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ చిరంజీవి సినిమా పరిశ్రమలో సీనియర్ హీరోలుగా మాత్రమే కాకుండా ఇక చిత్ర పరిశ్రమకు మూల స్తంభాలుగా కొనసాగుతున్నారు.

ఈ నలుగురు హీరోలు పోలీస్ కాన్సెప్ట్ తో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.మరి ఎవరు గెలిచారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.టాలీవుడ్ మన్మథుడి గా పేరు సంపాదించుకున్న నాగార్జున ప్రియదర్శన్ దర్శకత్వంలో నిర్ణయం అనే సినిమా వచ్చింది.ఇక ఇందులో నాగార్జున భార్య అమల హీరోయిన్గా నటించింది.

ఇక పోలీస్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా 1991 ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాగా చివరికి విఫలమైంది.చిరంజీవి ఎస్పి పరశురాం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 94 మార్చి 4 వ తేదిన విడుదలైంది.

Telugu Amala, Balakrishna, Chiranjeevi, Nagarjuna, Nirnayam, Rowdy, Sp Parashura

సినిమాలో చిరు నటనతో అదరగొట్టిన ఎందుకో బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్దగా ఆదరణ పొందలేదు ఈ సినిమా.అదే ఏడాది సూపర్ పోలీస్ అనే టైటిల్ తో వెంకటేష్ ప్రేక్షకులను పలకరించాడు.కే మురళీమోహన్ తెరకెక్కించిన ఈ సినిమాలో నగ్మా సౌందర్య హీరోయిన్లుగా నటించారు.

కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది.ఇక అలాంటి సమయంలోనే బాలయ్య హీరోగా వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా బ్లాక్బస్టర్ కొట్టేసింది.

బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.ఇలా నలుగురు హీరోలు కూడా పోలీసు పాత్రలో నటిస్తే బాలయ్య ప్రేక్షకులను మెప్పించి గెలిచారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube