మెగాస్టార్‌ సంక్రాంతి సందడి.. అభిమానులకు పండగే పండగ

సంక్రాంతి అంటే తెలుగు ప్రేక్షకులకు సందడే సందడి అనడంలో సందేహం లేదు.ఒక వైపు పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేయడం తో పాటు ఇతర సినిమాల ఫస్ట్ లుక్ టీజర్ ట్రైలర్ ఇలా ఎన్నో ఎన్నెన్నో సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంటాయి.

 Chiranjeevi Back To Back Movie First Look Posters , Chiranjeevi , Sankranthi Cel-TeluguStop.com

భారీ ఎత్తున సంక్రాంతి సెలబ్రేషన్స్ ఒకవైపు జరుగుతూ ఉండగా మరోవైపు సినిమాలకు సంబంధించిన హడావుడి కనిపిస్తూ ఉంటుంది.ఎప్పటిలాగే ఈసారి కూడా సినిమా పరిశ్రమ సంక్రాంతి జోరు కనిపించబోతుంది.

కరోనా వల్ల సినిమాలు విడుదల కావడం లేదు కానీ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రం వరుసగా రాబోతున్నాయి.మెగాస్టార్ చిరంజీవి నటించిన పలు చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్స్ ను బ్యాక్ టు బ్యాక్ ఇవ్వబోతున్నట్లు గా వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ మరియు భోళాశంకర్‌ సినిమాలకు సంబంధించిన టీజర్ లను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు గా సమాచారం అందుతోంది.

Telugu Acharya, Bholashankar, Bobby, Chiranjeevi, Godfather, Sankranthi, Venky K

ఆ రెండు సినిమాలతో పాటు బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్తేరు వీరన్న సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ కూడా ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇక ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్న ఆచార్య నుండి మరో కొత్త పోస్టర్ కూడా రాబోతుంది.ఇవన్నీ ఒక ఎత్తయితే చిరంజీవి మరో కొత్త సినిమాను నేడు ప్రకటించే అవకాశం ఉంది.

ఇప్పటికే ఆ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి.వెంకీ కుడుముల దర్శకత్వంలో ఆ సినిమా ఉండబోతుంది.

చిరంజీవి హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో కొత్త సినిమా అంటూ సంక్రాంతి సందర్భంగా అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.మొత్తానికి చిరంజీవి అభిమానులకు గాను సంక్రాంతి సర్ ప్రైజ్ సందడి మామూలుగా లేదు.

ఖచ్చితంగా వారి పండుగ రెట్టింపు లేదా మూడు రెట్లు అవుతుందని ఆనందం వ్యక్తం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube