చిన్న పిట్టకథ చెప్పడానికి వస్తోన్న మెగాస్టార్....   

Chiranjeevi Attends To The O Pitta Kata Movie Pree Release Event - Telugu Chiranjeevi, , O Pitta Kata, O Pitta Kata Movie Pree Release, Tollywood

తెలుగులో మనమంతా, తోలుబొమ్మలాట, కేరింత, జెర్సీ వంటి చిత్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న  హీరో విశ్వంత్ తాజాగా “ఓ పిట్ట కథ” అనే  చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు చందు ముద్దు దర్శకత్వం వహిస్తుండగా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత ఆనంద ప్రసాద్ నిర్మించారు.

Chiranjeevi Attends To The O Pitta Kata Movie Pree Release Event

విచిత్రం దేవుళ్ళు చిత్రంలో చిన్నారి పాత్రలో తెలుగు ప్రేక్షకులను మెప్పించినటువంటి నిత్య శెట్టి హీరోయిన్ గా, నటిస్తుండగా సంజయ్ రావు, బ్రహ్మాజీ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మార్చి ఒకటో తారీఖున హైదరాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.

అంతేకాక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరవుతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.అంతేగాక ఈ విషయానికి సంబంధించి నటువంటి పోస్టర్ ని కూడా విడుదల చేశారు.

అయితే చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి చిన్న, పెద్ద హీరోలని చూడకుండా చిత్రాల ప్రమోషన్ లో భాగంగా తన వంతు సహాయాన్ని అందిస్తున్నాడు.

ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి చిత్రీకరణ పూర్తి కావడంతో ఈ చిత్రాన్ని దర్శకుడు చందు ముద్దు వచ్చే నెల 6వ తారీకున విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు.మరి ఈ పిట్ట కథ ప్రేక్షకుల్ని ఎలాగ ఆకట్టుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు

Chiranjeevi Attends To The O Pitta Kata Movie Pree Release Event-,o Pitta Kata,o Pitta Kata Movie Pree Release,tollywood Related....