చిరంజీవి సినిమా రీమేక్.. హీరోగా అతను.. హీరోయిన్ గా శ్రీదేవి.. నిర్మాతకు ముప్పుతిప్పలు?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రీమేక్ చిత్రాలు రావడం సర్వసాధారణం.ఒక భాషలో అద్భుతమైన విషయాలను సాధించిన చిత్రాన్ని ఇతర భాషలలో రీమేక్ చేయడం ఎప్పటినుంచో ఉంది.

 Megastar Chiranjeevi At Bollywood Movie Team Party Details,  Tollywood, Chiranje-TeluguStop.com

ఇలా ఎన్నో రీమేక్ చిత్రాలు వివిధ భాషలలో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను సాధించాయి.ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో 1986వ సంవత్సరంలో లెజెండరీ డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి జంటగా నటించిన చిత్రం “ఖైదీ రుద్రయ్య”.

ఈ చిత్రాన్ని  టి.త్రివిక్రమరావు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవిని తీసుకోవడం కోసం అప్పట్లో నిర్మాతలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకున్న శ్రీదేవి అప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగిస్తున్నారు.

అలాంటి సమయంలో ఆమె డేట్స్ దొరకడం కూడా ఎంతో ఇబ్బందిగా ఉన్న రోజులవి.ఆ సమయంలో ఈ సినిమా కోసం నిర్మాతలు ఎంతో కష్టపడి ఆమె డేట్స్ సంపాదించుకున్నారు.

ఇలా శ్రీదేవి చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

Telugu Chiranjeevi, Khaidi Rudrayya, Sirdevi, Sridevi, Tollywood, Trivikrama Rao

తెలుగులో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని భావించారు.ఈ క్రమంలోనే  టి.త్రివిక్రమరావు ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించాలని భావించారు. కె.బాపయ్య దర్శకత్వం మిధున్ చక్రవర్తి శ్రీదేవి జంటగా ఈ చిత్రాన్ని  ‘వక్త్‌ కీ ఆవాజ్‌’ అనే పేరుతో తెరకెక్కించారు.ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ చెన్నైలో ప్రారంభంకాగా ఆ రోజు రాత్రి చిత్రబృందం పెద్ద పార్టీ జరుపుకున్నారు.

Telugu Chiranjeevi, Khaidi Rudrayya, Sirdevi, Sridevi, Tollywood, Trivikrama Rao

ఇక తెలుగులో ఈ సినిమాలో నటించే అద్భుతమైన విజయాన్ని అందించిన హీరో చిరంజీవిని కూడా ఈ పార్టీకి ఆహ్వానించారు.ఇలా ఈ పార్టీలో కలిసిన వీరందరూ సరదాగా అందరూ కలిసి పార్టీ చేసుకున్నారు.అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి శ్రీదేవి మొట్టమొదటిసారిగా మిధున్ చక్రవర్తి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

ఇలా వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన మొదటి సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో వీరి మధ్య ఏదో రిలేషన్ ఉంది అంటూ అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో కోడై కూసింది.

Telugu Chiranjeevi, Khaidi Rudrayya, Sirdevi, Sridevi, Tollywood, Trivikrama Rao

ఇక వీరిద్దరి మధ్య ఈ విధమైనటువంటి రిలేషన్ ఉందని వస్తున్న వార్తల వల్ల ‘వక్త్‌ కీ ఆవాజ్‌’ షూటింగ్ సమయంలో తాను ఎంతో ఇబ్బంది పడ్డానని.అలాగే వీరి కారణంగా కొన్ని షెడ్యూల్స్ కూడా చాలా ఆలస్యంగా తెరకెక్కడం వల్ల అప్పట్లో నిర్మాత ఎన్నో ఇబ్బందులు పడి ఎట్టకేలకు ఈ చిత్రాన్ని పూర్తి చేశారు.మొత్తానికి ఈ చిత్రం కూడా హిందీలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube