చిరు సినిమాలో ఖుషి సీన్ రిపీట్.. ఇందులో నిజమెంతంటే?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఇటీవల ఆచార్య సినిమాతో ప్రేక్షకులను వచ్చిన విషయం తెలిసిందే.

 Chiranjeevi As Pawan Kalyan Fan In Bhola Shankar Movie , Pawan Kalyan, Chiranjeevi, Bhola Shankar Movie, Tollywood, Mohar Ramesh,anchor Srimukhi,khushi Sean-TeluguStop.com

అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ ఆచార్య సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.ఇకపోతే చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో మొహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బోళా శంకర్ సినిమా కూడా ఒకటి.

ఈ సినిమా తమిళ బ్లాక్ బస్టర్ వేదాళమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

 Chiranjeevi As Pawan Kalyan Fan In Bhola Shankar Movie , Pawan Kalyan, Chiranjeevi, Bhola Shankar Movie, Tollywood, Mohar Ramesh,Anchor Srimukhi,Khushi Sean-చిరు సినిమాలో ఖుషి సీన్ రిపీట్.. ఇందులో నిజమెంతంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రీమేక్ అయినప్పటికీ దర్శకుడు మెహర్ రమేష్ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా అనేక మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి స్వాగ్ ఆఫ్ భోళా పేరుతో విడుదల చేసిన గ్లింప్స్ కు అభిమానుల నుంచి భారీగా స్పందన లభించింది.ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ఈ సినిమాలో చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపించబోతున్నారట.

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సీన్ ని రిపీట్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ భూమిక ల మధ్య నడుము సీన్ ఎంత హైలెట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే.అయితే అదే సన్నివేశాన్ని ఇప్పుడు బోలా శంకర్ సినిమాలో కూడా స్పూఫ్ గా వాడబోతున్నారట.ఆ సినిమాలో చిరంజీవి, యాంకర్ శ్రీముఖి ల మధ్య ఆ సీన్ రాబోతోంది అని తెలుస్తోంది.

ఇక ఆ సన్నివేశంలో చిరంజీవి రొమాంటిక్ చూపులు డైలాగ్స్ కి తగ్గట్టుగానే శ్రీముఖి కూడా హావభావాలు పలికింది అని వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.ఈ విషయంపై కొందరు అభిమానులు హర్ట్ అయినట్లు తెలుస్తోంది.

ఎందుకంటే మెగాస్టార్ రేంజ్ ఏంటి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నటించడం ఏంటి.? అలాగే ఖుషి నడుము సీన్ స్పూఫ్ లో నటించడం ఏంటి అంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.మరి దర్శకుడు మెహర్ రమేష్ ఆ రొమాంటిక్ సన్నివేశాన్ని సినిమాలో ఉంచుతార లేకపోతే సినిమాలో నుంచి ఆ సన్నీ వేశాన్ని తీసేస్తారా చూడాలి మరి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube