రాజశేఖర్‌ కోసం చిరంజీవి ప్రత్యేక ఏర్పాట్లు  

chiranjeevi arrange special doctors team to rajashekhar for corona treatment , corona treatment , Apollo Hospital, Chiranjeevi, Upasana, Rajasekhar Health Bulletin, Rajasekhar Health - Telugu Apollo Hospital, Chiranjeevi, Corona Treatment, Jeevitha, Rajasekhar Health Bulletin, Rajashekhar Corona, Shivani, Shivatmika, Tollywood Corona, Upasana

యాంగ్రీయంగ్‌ మన్‌ రాజశేఖర్‌ కరోనాతో పోరాడుతున్న విషయం తెల్సిందే.ఆయన కుటుంబంలోని మొత్తం నలుగురు కూడా కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వగా మొదట ఇద్దరు కూతుర్లు కరోనా నుండి బయట పడ్డారు.

TeluguStop.com - Chiranjeevi Arrange Special Doctors To Rajashekhar For Corona Treatment

కాస్త ఆలస్యంగా అయినా జీవిత కూడా కరోనాను జయించింది.కాని రాజశేఖర్‌ మాత్రం కరోనాతో ఇంకా పోరాటం చేస్తున్నారు.

ప్రస్తుతం రాజశేఖర్‌కు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా వైధ్యులు పేర్కొన్నారు.రాజశేఖర్‌ హెల్త్‌ బులిటెన్‌ ప్రస్తుతం ఆయన అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది.

TeluguStop.com - రాజశేఖర్‌ కోసం చిరంజీవి ప్రత్యేక ఏర్పాట్లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

రాజశేఖర్‌ త్వరగా కోలుకుని బయటకు వచ్చేయాలంటూ అందరు ప్రార్థిస్తున్నారు.ఆయన కుటుంబ సభ్యులు చిగురుటాకు మాదిరిగా వణికి పోతున్నారు.

ఈ విషయంలో వారి ఆందోళనను చిరంజీవి గుర్తించినట్లుగా ఉన్నారు.

చిరంజీవి కుటుంబంతో అపోలో యాజమాన్యంకు బంధుత్వం ఉంది.

చిరు కోడలు అయిన ఉపాసన వాళ్లదే అపోలో.అందుకే చిరంజీవి అత్యున్నత వైధ్య బృందంను రాజశేఖర్‌ కోసం ఏర్పాటు చేయాల్సిందిగా అపోలో వారిని చిరంజీవి కోరాడట.

ప్రస్తుతం వారు రాజశేఖర్‌ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని సినీ వర్గాల వారి ద్వారా తెలుస్తోంది.కరోనా రోగులను ఎంతో మందిని కాపాడిన వారు ఇప్పుడు రాజశేఖర్‌ ను ప్రాణాలతో కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

రాజశేఖర్‌ మరియు చిరంజీవిల మద్య గతంలో విభేదాలు ఉన్న మాట వాస్తవమే అయినా ఆ తర్వాత తర్వాత కాలంలో అవి కనుమరుగు అయ్యాయి.ఇద్దరు కూడా కలిసి ఈమద్య కాలంలో చాలా వేదికలపై మాట్లాడుకున్నారు.

ఆ అనుబంధంతోనే రాజశేఖర్‌ను సేవ్‌ చేసేందుకు గాను చిరంజీవి ప్రత్యేక వైధ్య బృందంను ఏర్పాటు చేయడం జరిగింది.అతి త్వరలోనే రాజశేఖర్‌ పూర్తి ఆరోగ్యంగా ఆసుపత్రి నుండి బయటకు వచ్చేస్తాడు అంటూ ఆయన అభిమానులు మరియు కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.

ఆయన త్వరగా కోలుకోవాలని మనమూ కోరుకుందాం.

#Jeevitha #Chiranjeevi #Upasana #Shivani #Apollo Hospital

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chiranjeevi Arrange Special Doctors To Rajashekhar For Corona Treatment Related Telugu News,Photos/Pics,Images..