మాట నిలబెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి..!!

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.3లక్షల దగ్గరకు కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యే పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఉండటంతో…  కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉంది అని తెలుస్తోంది.ఈ క్రమంలో ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు… కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి.మరోపక్క వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం కూడా శరవేగంగా చేస్తున్నాయి.ఇలాంటి తరుణంలో దేశంలో ప్రముఖ కంపెనీలు మరియు సంస్థలు తమ వద్ద పనిచేసే కార్మికులకు, ఉద్యోగస్తులకు ఫ్రీగా వ్యాక్సిన్ వేస్తూ ఉన్నాయి.

 Chiranjeevi Announced Free Vaccine To Cine Workers-TeluguStop.com

ఈ క్రమంలో గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో పనిచేసే కార్మికులకు ఫ్రీగా వ్యాక్సిన్ కరోనా క్రైసిస్ చారిటబుల్(CCC) ట్రస్ట్ ద్వారా వేస్తామని చిరంజీవి మాట ఇవ్వడం తెలిసిందే.

ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి త్వరలోనే ఇండస్ట్రీలో ఉన్న సినీ కార్మికులకు.వ్యాక్సిన్ అందించబోతున్నాట్లూ సోషల్ మీడియా సాక్షిగా మరోసారి గుర్తు చేశారు.ఈ క్రమంలో సినీ కార్మికులు తమ అసోసియేషన్ ద్వారా యాక్షన్ ల కోసం పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.ఏప్రిల్ 22 వ తారీకు నుండి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుందని 45 ప్రాంతాలు పైబడిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి అని సూచించారు.

 Chiranjeevi Announced Free Vaccine To Cine Workers-మాట నిలబెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Chiranjeevi, Cine Field Workers, Corona Crisis Charity, Corona Second Wave, Corona Vaccine, Covid-19, Free Corona Vaccine, Journalists, Tollywood Industry-Latest News - Telugu

ఒక సినీ కార్మికులకు మాత్రమే కాక జర్నలిస్టులకు కూడా వ్యాక్సిన్ ఉచితంగా వేయించాలని చిరంజీవి నిర్ణయించుకొన్నారు.లాక్ డౌన్ సమయం లో చిరంజీవి ఏర్పాటుచేసిన కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ) సంస్థ ద్వారా అనేక మంది నటీనటులు విరాళాలు అందించి .సినీ కార్మికులను ఆదుకోవడం జరిగింది.ఇదిలా ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ కీలకం అన్న టైం లో.ఇండస్ట్రీ పెద్దలు ముందుకు రావడంతో సినీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

#Journalists #COVID-19 #Corona Vaccine #FreeCorona #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు