వీడియోః 'ఆచార్య' లాహెలాహె కలర్ ఫుల్‌, చిరు ఈజ్‌ బ్యాక్‌

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా నుండి మొదటి పాట అనగానే అభిమానులు గాల్లో తేలిపోతున్నట్లుగా ఎగిరి పోతున్నారు.డాన్స్ కు ఆస్కారం ఉండే పాట అవ్వడం వల్ల మరింతగా అంచనాలు ఆకాశాన్నితాకేలా ఉన్నాయి.

 Chiranjeevi And Ram Charan Acharya Movie First Song Laahe Laahe , Acharya, Kaaja-TeluguStop.com

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.లాహెలాహె అనే పాట నుండి కొన్ని సెకన్ల బిట్ ను విడుదల చేయడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగానే పాట ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.అద్బుతమైన పాట మరియు అద్బుతమైన విజువల్స్ అంటూ మెగా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఆకాశమే హద్దు అన్నట్లుగా ఈ సినిమా సాంగ్స్ ఉంటాయని ఈ పాటతో అర్థం అవుతుంది.,/br>

చిరంజీవి మరియు మణిశర్మ ల కాంబోలో ఎన్నో మ్యూజికల్‌ సక్సెస్ లు వచ్చాయి.

కనుక ఈ సినిమా కూడా తప్పకుండా సూపర్‌ హిట్‌ పాటలను ప్రేక్షకులకు ఇవ్వబోతుంది అంటూ మెగా అభిమానులు నమ్మకంగా ఎదురు చూస్తున్నారు.ఈ సమయంలోనే మెగాస్టార్‌ చిరంజీవి మరియు రామ్‌ చరణ్‌ లు కలిసి ఉండే ఒక పాట కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.

లాహె లాహె పాటలో కాజల్‌ అగర్వాల్‌ ను చూడవచ్చు.మొదటి సారి ఆచార్యలో కాజల్‌ లుక్ ను ఈ పాట ద్వారా చూపించారు.

కేవలం రెండు నుండి మూడు వారాలు మాత్రమే ఈ సినిమా కోసం కాజల్ షూటింగ్ లో పాల్గొంది.అంటే ఆ పాత్ర ఎంత గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ పాటలో సంగీత ఉండటం వల్ల సినిమా లో ఆమె పాత్ర ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మొత్తానికి పాట అతి తక్కువ సమయంలో మిలియన్ వ్యూస్ ను దక్కించుకుని యూట్యూబ్‌ లో దుమ్ము రేపుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube