వెంకటేష్ కెరీర్ లో ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా.వెంకటేష్ నటనకు అద్దంపట్టిన సినిమా చంటి.
ఈ సినిమాలో ఏమీ తెలియని అమాయకుడి పాత్రలో వెంకటేష్ నటించిన తీరు ఇప్పటికి తెలుగు ప్రేక్షకులు మరిచిపోరు అని చెప్పాలి.జమీందారీ కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి కి ముగ్గురు అన్నయ్యలు.
వారికి చెల్లెలు అంటే ఎంతో ప్రేమ.చిన్నప్పటి నుంచి తల్లి లేని పిల్ల కావడంతో గారాబంగా పెంచుతారు.
పెద్ద అమాయకుడైన వెంకటేష్కి తళ్లే లోకం.అయితే ఇలాంటి వెంకటేష్ ను నందిని కి రక్షణగా పెడతారు.
ఆ తర్వాత నందిని అతనితో ప్రేమలో పడిపోతుంది.
ఆ విషయం అన్నయ్యలకు తెలుస్తుంది.
దీంతో ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఇక చంటి సినిమా. ఈ సినిమా ప్రేక్షకులందరినీ బాగా ఆకర్షించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.
అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 29 ఏళ్లు అవుతుంది.ఈ క్రమంలోనే ఈ సినిమాకు దాదాపు సినీ ప్రేక్షకులకు ఎవరికీ తెలియని ఒక విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
చంటి సినిమా విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఒక హీరోకి అన్యాయం చేశారు అన్న టాక్ ఉంది.
ఇంతకీ ఏం జరిగిందంటే తమిళ మూవీ చిన్న తంబీ ని తెలుగులో చంటి టైటిల్ తెజో రిమేక్ చేశారు.సినిమాలో ముందుగా రాజేంద్రప్రసాద్ ను అనుకున్నారట.ఈ పాత్రకు రాజేంద్రప్రసాద్ అయితే చక్కగా సరిపోతాడని భావించారట.
విడుదల కాకముందే చిన్న తంబీ ని రాజేంద్రప్రసాద్తో చేయాలని అనుకున్నారు.
ఈ సినిమా విడుదలై తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో సురేష్బాబు కెఎస్ రామారావు దగ్గరికి వచ్చి వెంకటేష్ తో ఈ సినిమా చేయాలని అడిగారట.
ఆ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి కల్పించుకుని ఇక వెంకటేష్ తో సినిమాకు దర్శకుడు రవి రాజా పినిశెట్టి నీ ఒప్పించారట.ఇక ఇలా రాజేంద్రప్రసాద్ ను తప్పించి వెంకటేష్ తో ఈ సినిమా చేయడానికి చిరంజీవి కారణమట.ఇలా రాజేంద్రప్రసాద్ కెరీర్ లో సూపర్ హిట్ అయ్యే సినిమాలో చిరంజీవి కారణంగా దూరం కావడంతో చిరంజీవి రాజేంద్రప్రసాద్ కెరియర్ కు అన్యాయం చేశాడు అంటూ అప్పట్లో టాక్ కూడా నడిచింది.