మెగా ఫ్యామిలీ హీరోలు అంతా ఒక్క చోట చేరితే మెగా ఫ్యాన్స్ కు కన్నుల పండుగ అనడం లో సందేహం లేదు.ప్రతి ఒక్క మెగా ఫ్యాన్ కోరుకునే ఫ్రేమ్ ఇది అనడంలో సందేహం లేదు.
రాబోయే అయిదు పదేళ్ల వరకు ఈ ఫొటో అలా నిలిచి పోతుంది.మెగా హీరోలు అంటే ఈ ఫొటో సోషల్ మీడియా లేదా వెబ్ మీడియాలో వస్తుంది అనడంలో సందేహం లేదు.
చిరంజీవి బర్త్ డే మరియు రాఖీ పండుగ ఒకే రోజు వచ్చిన నేపథ్యం లో చిరంజీవి ఇంట సందడి ఏ రేంజ్ లో ఉందో ఈ ఫొటోలను చూస్తుంటే అర్థం అవుతుంది.
చిరంజీవి ఇద్దరు సోదరులు పవన్ మరియు నాగబాబులు స్వయంగా చిరు ఇంటికి వెళ్లడంతో పాటు అక్కడ సోదరి ఇద్దరి తో కూడా రాఖి లు కట్టించుకుని పండుగ చేసుకున్నారు.
ఇదే సమయంలో ముగ్గురు మెగా బ్రదర్స్ తో పాటు రామ్ చరణ్.వరుణ్ తేజ్ ఇంకా వైష్ణవ్ మరియు సాయి ధరమ్ తేజ్ లను ఇందులో చూడవచ్చు.
అల్లు వారు ఇందులో లేరు కాని మిగిలిన హీరోలు అంతా కూడా ఈ ఫొటోలో సందడి చేశారు.
పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట అందరికి ఆకట్టుకున్నాయి.చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ లు ముద్దు పెట్టుకోవడం.పవన్ సరదాగా వదిన సురేఖ తో ఉండటం ఇలా అన్నింటికి సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
మెగా ఫ్యామిలీ హీరోలు షూటింగ్ లతో చాలా బిజీగా ఉన్నా కూడా ఇలా చిరంజీవి పుట్టిన రోజు మరియు రాఖి పండుగ సందర్బంగా తెగ హడావుడి అయ్యింది.