బీఏ రాజు మృతిపై చిరంజీవి, పవన్‌ల రియాక్షన్‌

సినిమా ఇండస్ట్రీలో పీఆర్‌ఓ అనగానే గుర్తుకు వచ్చే పేరు బీఏరాజు.1500 సినిమాలకు పైగా పీఆర్‌ గా వ్యవహరించిన బీఏ రాజు మృతి వార్త ఇండస్ట్రీ వర్గాల వారిని తీవ్రంగా కలచి వేసింది.ఆయన గుండె పోటుతో మృతి చెందినట్లుగా వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు స్పందించారు.మహేష్‌ బాబు నుండి మొదలుకుని చిరంజీవి పవన్ వరకు అందరు కూడా స్పందించారు.

 Chiranjeevi And Pawan Kalyan Comments On Ba Raju Death , Ba Raju, Ba Raju No Mo-TeluguStop.com

చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు హీరోలతో వర్క్‌ చేసిన బీఏ రాజు అంటే అందరికి అభిమానమే.అందుకే ఇండస్ట్రీ వర్గాల వారు బీఏ రాజు విషయమై ఎమోషనల్‌ అయ్యారు.

బీఏ రాజు మృతిపై చిరంజీవి స్పందిస్తూ బీఏ రాజు ఈ పేరు తెలియని వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఉండరు.నేను మద్రాసులో ఉన్న సమయంలో ఇండస్ట్రీకి చెందిన అన్ని విషయాలను నాతో చర్చించేవారు.

సినిమాకు సంబంధించిన కొత్త విషయాలను ఆయన నుండి తెలుసుకునే వాడిని.నా చాలా సినిమాలకు ఆయన పీఆర్‌ గా చేశాడు.ఏ సంవత్సరంలో సినిమా విడుదల అయ్యింది ఏ సినిమా ఎలా వసూళ్లు సాధించింది అనే విషయాలు ఆయనకు గుర్తు.100 రోజులు, 175 రోజులు, 200 రోజులు అంటూ సినిమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయన గుర్తు ఉంచుకునే వారు.అలాంటి వ్యక్తి లేడనే విషయం తెలిసి షాక్ అయ్యాను.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Telugu Ba Raju, Chiranjeevi, Pawan Kalyan-Movie

పవన్ కళ్యాణ్‌ స్పందిస్తూ జర్నలిస్టుగా పీఆర్‌ఓ గా తెలుగు సినిమా పరిశ్రమకు చిరపరిచితులైన బీఏ రాజు గారు మరణం దిగ్బ్రాంతిని కలిగించింది.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.ఆయనతో చెన్నైలో ఉన్నప్పటి నుండి పరిచయం ఉన్నది.సినిమా అంటే ఎంతో తపన ఉన్న వ్యక్తి ఆయన.అన్నయ్య చిరంజీవి గారి సినిమాలకు ఆయన పీఆర్‌ గా వ్యవహరించారు. నిర్మాతగా మీడియా అధినేతగా ఎన్నో బాధ్యతలు నిర్వహించారు.

ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube