చిరు, మోహన్‌బాబుల మద్య ట్విట్టర్‌లో ఆసక్తికర చర్చ  

Chiranjeevi And Mohan Babu Chiranjeevi Twitter Mohan Babu Twitter - Telugu Chiranjeevi, Chiranjeevi And Mohan Babu Friendship, Chiranjeevi Comments On Mohan Babu, Chiranjeevi Twitter, Corona Virus, Mohan Babu

మెగాస్టార్‌ చిరంజీవి ఉగాది రోజున ట్విట్టర్‌లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.చిరంజీవి ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటూ పోస్ట్‌లు పెడుతూ వస్తున్నాడు.

 Chiranjeevi And Mohan Babu Chiranjeevi Twitter Mohan Babu Twitter

ప్రముఖులు పలువురు ట్విట్టర్‌లో చిరంజీవికి వెల్‌ కమ్‌ చెప్పగా వారికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.ముఖ్యంగా మోహన్‌బాబు ట్విట్టర్‌లో చిరంజీవికి మిత్రమా స్వాగతం అంటూ ట్వీట్‌ చేసి వెల్‌ కమ్‌ చెప్పగా చిరంజీవి థ్యాంక్యూ చెప్పడమే కాకుండా రాననుకున్నావా రాలేననుకున్నావా అంటూ సరదాగా ట్వీట్‌ చేశాడు.

ఆ ట్వీట్‌కు మోహన్‌ బాబు కాస్త ఆలస్యంగా స్పందించాడు.చిరంజీవి ట్వీట్‌పై స్పందించిన మోహన్‌బాబు ఈసారి హగ్‌ చేసుకున్నప్పుడు చెప్తాను అంటూ సరదాగా స్పందించాడు.అందుకు సమయస్ఫూర్తిగా స్పందించిన చిరంజీవి మిత్రమా కరోనా రక్కసి కోరలు చాస్తున్న ఈ తరుణంలో మనలో మార్పు రావాలి.నో హగ్స్‌ నో షేక్‌ హ్యాండ్స్‌ ఓన్లీ నమస్తే.

చిరు, మోహన్‌బాబుల మద్య ట్విట్టర్‌లో ఆసక్తికర చర్చ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

సామాజిక దూరం తప్పనిసరిగా పాటిద్దాం.మరింత అవగాహణ కోసం నీ కూతురు మంచు లక్ష్మి చేసిన పాటను చూడు అంటూ మోహన్‌బాబుకు సలహా ఇచ్చాడు.

ప్రస్తుతం వీరిద్దరి మద్య జరిగిన ట్విట్టర్‌ సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.వీరిద్దరి మద్య వైరం ఉందని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.

అయితే ఈమద్య కాలంలో వీరిద్దరు ఎక్కువ కార్యక్రమాల్లో కలిసి పాల్గొని హగ్‌ చేసుకోవడంతో పాటు ముద్దులు కూడా పెట్టుకున్నారు.దాంతో మళ్లీ వీరిద్దరు స్నేహంగా మారినట్లుగా అనిపిస్తుంది.

ఇప్పుడు సోషల్‌ మీడియాలో వీరి సంభాషణ మరింతగా వారి స్నేహం గురించి చెప్పకనే చెబుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..