ఏపీ సీఎం ఫండ్ కు విరాళం ప్రకటించిన మహేష్, చిరు, ఎన్టీఆర్?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కురిసిన ఈ అకాల వర్షాల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది.ఈ వర్షాల వల్ల ఏపీ లోని పలు దేశాలకు వరదలు పోటెత్తి ఇళ్లను, పంటలను, మనుషులను తుడిచిపెట్టుకుపోయాయి.

 Chiranjeevi Mahesh Babu Ntr Donations To Cm Relief Fund Details, Chiranjeevi, Jr-TeluguStop.com

ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏపీలో పలుచోట్ల గ్రామాలు నీటమునిగాయి.ఇప్పటికీ ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి.

అయితే ఈ వరదబాధితులకు అండగా నిలబడటానికి సినీ పరిశ్రమ ముందడుగు వేసింది.టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన చిరంజీవి, మహేష్ బాబు వరద బాధితుల కోసం తలా 25 లక్షల రూపాయలను విరాళంగా అందిస్తున్న ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

ఆంధ్ర ప్రదేశ్ లో వరదల విపత్తు బాధిత కుటుంబాలకు నా వంతు సహాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షల రూపాయలు ప్రకటిస్తున్నాను అని చిరంజీవి తెలిపారు.అనంతరం మహేష్ బాబు తో పాటు ఎన్టీఆర్ కూడా వరద బాధితులకు సహాయాన్ని అందించారు.

ఆంధ్రప్రదేశ్ లో ఈ వినాశకరమైన వరదలు సంభవించాయి.దీనితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

వారి కోసం నా వంతుగా 25 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తున్నాను.ఈ సంక్షోభ సమయంలో ప్రతి ఒక్కరూ అండగా నిలబడాల్సిన తరుణం, అందరూ ముందుకు వచ్చి ఆంధ్ర ప్రదేశ్ కు సహాయం చేయండి అంటూ మహేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

ఏపీలో వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్షణ సహాయంగా కేంద్ర ప్రభుత్వం కొంత సహాయం అందించాలి అని వైయస్ జగన్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు.ఈ అకాల వర్షాలతో రాయలసీమలోని కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాలలో వరదలు పోటెత్తడంతో భారీ మొత్తంలో ఆస్తి నష్టం, ప్రాణనష్టం సంభవించాయి.అదే విధంగా రహదారులు దెబ్బతిన్నాయి.దాదాపుగా 25 లక్షల హెక్టార్లలో పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.అంతేకాకుండా దాదాపుగా ఆరు వేల కోట్లకు పైగా వరద నష్టం సంభవించింది అని ప్రభుత్వం అంచనా వేసింది.ఇలాంటి విపత్కర పరిస్థితులలో సినీ ప్రముఖులు ముందుకు రావడం ఎంతో గర్వించదగ్గ విషయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube